కూటమి నానాజాతి సమితి.. అందులో చిరంజీవి; సోషల్ మీడియాలో రచ్చ!!
రాజకీయాలు వద్దు వద్దంటూనే మెగాస్టార్ చిరంజీవి 2024 ఎన్నికలలో రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు నాకు సరిపడవు అంటూనే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి జనసేన పార్టీకి ఐదు కోట్ల భారీ విరాళాన్ని ఇవ్వడంతో పాటు, రాజకీయాలలో తన తమ్ముడి నిబద్ధత తనకు ఎంతో నచ్చిందని కితాబిచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీకి చిరంజీవి మద్దతు ఇస్తున్నారని ప్రచారం జరిగింది.
ఏపీ ఎన్నికలపై చిరంజీవి ఇలా
ఇక ఆపై చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని, మంచి దూర దృష్టి ఉన్న నాయకుడని కితాబిచ్చారు. దీంతో చంద్రబాబుకు, టీడీపీకి చిరంజీవి మద్దతు ఇస్తున్నారని జనాలలోకి సంకేతం వెళ్ళింది. ఇక తాజాగా పంచకర్ల రమేష్ బాబును, సీఎం రమేష్ ను చెరోవైపు కూర్చోబెట్టుకొని కూటమిలోని ఇద్దరు నేతలకు ఓటు వేయాలంటూ ఒక వీడియో విడుదల చేశారు చిరంజీవి.

కూటమికి చిరంజీవి మద్దతు
దీంతో చిరంజీవి కూటమికి మద్దతుగా వకాల్తా పుచ్చుకుంటున్నారు అన్న విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో చిరంజీవిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి నేరుగా తన కూటమికి మద్దతునిస్తున్నానని చెప్పకుండా తన చర్యలు ద్వారా కూటమికి మద్దతును ప్రకటిస్తున్నారని వారు మండిపడుతున్నారు.
కూటమిలో చిరంజీవి కూడా
మెగాస్టార్ చిరంజీవి కూటమికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం తమకు సంతోషమేనని, ఎవరు ఎటువైపు ఉన్నారన్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలిసిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కూటమిలో నక్కలు తోడేళ్లు హైనాలు అన్నీ కలిసిపోయాయని పేర్కొన్న ఆయన ఇటువైపు .. జగన్ ఒక్కరే సింగిల్ గా ఉన్నారని స్పష్టం చేశారు. కూటమి ఓ నానాజాతి సమితిలా మారిపోయిందని ఇప్పుడు అందులో చిరంజీవి కూడా చేరారు అంటూ ఎద్దేవా చేశారు.
చిరంజీవిని టార్గెట్ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా
కూటమి వైపు ఎంతమంది నాయకులు వచ్చినా, ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఏపీలో గెలిచేది మాత్రం వైసీపీనే అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.ఇక సోషల్ మీడియాలో చిరంజీవిని టార్గెట్ చేస్తూ స్వార్థపూరిత రాజకీయాలు చేయడంలో చిరంజీవి దిట్ట అని అందుకే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి పదవులు పొందారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక అటువంటి చిరంజీవి మద్దతిస్తున్న కూటమి ఎంత గొప్పకూటమో అందరూ ఆలోచించాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.
చిరంజీవికి రాజకీయాలు అవసరమా
అసలు ప్రజారాజ్యం పార్టీ లేకుండా చేయడం వెనక టిడిపి పాత్ర ఉందని అటువంటి టిడిపికి చిరంజీవి మద్దతు పలకడం ఏమిటని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. రాజకీయాలు వద్దని సైలెంట్ గా ఉంటున్న చిరంజీవి అదే పంధా కొనసాగిస్తే బాగుండేదని మళ్లీ అనవసరంగా రాజకీయాలు మాట్లాడి పరువు పోగొట్టుకోవడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా టిడిపి బిజెపి జనసేన కూటమికి మద్దతుగా చిరంజీవి తాజా చర్యలు కూటమి శ్రేణులకు బూస్ట్ ఇస్తే వైసీపీ శ్రేణులకు మాత్రం ఆగ్రహం తెప్పిస్తుంది.
-
Polavaram:పోలవరంకు మహర్దశ - చంద్రబాబు ప్లాన్ అదుర్స్..!! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఇప్పుడు తిప్పండి చక్రం..!! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
చిరంజీవికి సీనియర్ NTR సినిమాల్లో అదంటే మహా ప్రాణం.. ఎవరూ ఊహించనది -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications