జైలు భయంతోనే: జగన్‌పై చిరు, రాత్రికి రాత్రే: సురవరం

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి నిప్పులు చెరిగారు. శాశ్వతంగా జైల్లో ఉండాల్సి వస్తుందనే జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. అధికారం ఉంటే తప్పించుకోవచ్చని ఆయన అనుకుంటున్నారన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చిరు మాట్లాడారు. జగన్ పార్టీకి ఓటు వేస్తే దోపిడీ పాలనే అన్నారు. తండ్రి శవాన్ని దగ్గర పెట్టుకుని సిఎం పదవి కోసం జగన్ తప్పటడుగు వేశారన్నారు. లక్షల కోట్లు లూటీ చేసిన జగన్‌కు ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు.

నకీలి పార్టీ: జగన్ పైన జైరాం

వైయస్సార్ కాంగ్రెసు ఓ నకిలీ కాంగ్రెస్ పార్టీ అని కేంద్రమంత్రి జైరాం రమేష్ అనంతపురం జిల్లాలో అన్నారు. వైయస్ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ పథకాలేనని, జైలుకు వెళ్లే జగన్‌కు ఓటు వేయొద్దన్నారు. కావూరి, లగడపాటి, రాయపాటి కాంగ్రెస్‌తో లబ్ది పొంది, ఇప్పుడు పార్టీ మార్చారని మండిపడ్డారు. టిడిపి, బిజెపిలు మరోసారి ప్రజలను మోసంచేసేందుకు యత్నిస్తున్నారన్నారు. విభజన తరువాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారు.

Chiranjeevi targets YS Jagan

300 సీట్లు: వెంకయ్య

నరేంద్ర మోడీపై కేంద్రం విచారణకు ఆదేశించడం సిగ్గుచేటు అని బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ దిగిపోయే ముందు విచారణకు ఆదేశించే అధికారం హోంమంత్రికి ఎక్కడిదని ప్రశ్నించారు. సీమాంధ్రలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో సోనియా గాంధీ ఖాళీ కుర్చీలకు ఉపన్యాసమిచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. బిజెపి 300 స్థానాల్లో గెలుస్తుందన్నారు.

అవినీతిపరులు వద్దు: కెఏ పాల్

ఎన్నికల్లో అవినీతి పరులకు ఓటు వేయొద్దని కెఏ పాల్ పిలుపునిచ్చారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ను ఓడించాలని ఆయన కోరారు. కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసమరమని పాల్ పేర్కొన్నారు. దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని అయితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. తనను ఇప్పుడూ చంపాలని చూస్తున్నారన్నారు. తనను నాశనం చేయాలని చూసినవాళ్లే ఇప్పుడు నాశనం అయిపోతున్నారని ఆయన అన్నారు.

పవన్, బాబులపై సురవరం

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీలపై సురవరం సుధాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. టిడిపి, బిజెపిల కలయిక ప్రమాదకరమన్నారు. ఇతర పార్టీలలో టిక్కెట్లు రాని వారికి చంద్రబాబు రాత్రికి రాత్రే టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించారు. రాజకీయాల్లో ధన ప్రవాహం మొదలు పెట్టింది చంద్రబాబే అన్నారు. టిడిపి, బిజెపి కలయిక అపవిత్రమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+