హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు -"మా" లో మొదలైన మైండ్ గేమ్ :ఇద్దరి చుట్టూ ఎన్నికలు-గెలిచేదెవరు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మెగాస్టార్ చిరంజీవి-కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. టాలీవుడ్ లో ఈ ఇద్దరి మధ్య గతంలో ఎలా ఉన్నా..ఇప్పుడు "మా" ఎన్నికల్లో మాత్రం హాట్ టాపిక్ అయ్యారు. ప్రకాశ్ రాజ్ కు మెగా క్యాంపు మద్దతు ఉందని ఓపెన్ గానే అందరూ చెబుతున్నారు. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ మాత్రం తనకు మెగాస్టార్ మద్దతు ఉందనే అంశాన్ని ఓపెన్ గా మాత్రం ఒప్పుకోవటం లేదు. వకీల్ సాబ్ సినిమా తరువాత ప్రకాశ్ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసిన సమయంలో ఆ మేరకు మెగాస్టార్ నుంచి హామీ వచ్చిందని చెబుతున్నారు.

Recommended Video

MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Oneindia Telugu
చిరంజీవి అడిగినా మోహన్ బాబు నో

చిరంజీవి అడిగినా మోహన్ బాబు నో

ఇక, ప్రకాశ్ రాజ్ తొలుత తన ప్యానెల్ పరిచయ సమయంలో నాగబాబు ఎంట్రీ..చేసిన వ్యాఖ్యలతో మరింత క్లారిటీ వచ్చింది. ఇక, ప్రకాశ్ రాజ్ కు పోటీగా విష్ణు రంగంలోకి వచ్చారు. తన వెనుక తండ్రి మోహన్ బాబు ఉన్నారని..ఇప్పటికే 700 మంది సభ్యులతో తనకు మద్దతుగా మాట్లాడారని విష్ణు స్వయంగా వెల్లడించారు. ఇక, మోహన్ బాబు సైతం తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూల్లో విష్ణు గెలుపు ఖాయమని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఇక, ప్రకాశ్ రాజ్ వర్సెస్ విష్ణు పోరులో ముందుగానే విష్ణు బరిలో ఉండటం పైన చిరంజీవి నేరుగా మోహన్ బాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.

ప్రకాశ్ రాజ్ కు మెగాస్టార్ మాట

ప్రకాశ్ రాజ్ కు మెగాస్టార్ మాట

తాను ప్రకాశ్ రాజ్ కు మాట ఇచ్చానంటూ తనతో చెప్పారని మోహన్ బాబే వెల్లడించారు. అయితే, మెగా కుటుంబం నుంచి ఎవరు బరిలో ఉన్నా తాను విష్ణుతో విత్ గ్రా చేయించే వాడినని..ఎవరికో మాట ఇచ్చి తనకు ఫోన్ చేయటం సబబేనా అని మోహన్ బాబు ప్రశ్నిస్తున్నారు. ఇక, నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రచారం పీక్ లో ఉంది. ఈ సమయంలో అటు విష్ణుకు మద్దతుగా తాజా..మాజీ అధ్యక్షుడు నరేశ్, అదే విధంగా పరోక్షంగా క్రిష్ణ..ప్రత్యక్షంగా బాలక్రిష్ణ మద్దతు -ఆశీస్సులు ఉన్నాయి. ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో బాగా పరిచయం ఉన్న నటులే సభ్యులే పోటీ చేస్తున్నారు.

మారుతున్న అంచనాలు

మారుతున్న అంచనాలు

దీంతో.. మెగా క్యాంపు మద్దతుతో ఖచ్చింగా 900 మంది ఓట్లలో మెజార్టీ తమకే అనే ధీమాతో ప్రకాశ్ రాజ్ శిబిరం ఉంది. అదే సమయంలో విష్ణు టీం...ప్రకాశ్ రాజ్ ను కార్నర్ చేస్తూ కొన్ని అడుగులు వేసింది. అందులో భాగంగా సీనియర్ నటుల పోస్టల్ బ్యాలెట్ విషయం ఒకటి. ముందుగా ఈవీఎంలతో ఎన్నికలు అని నిర్ణయించినా...విష్ణు ప్యానల్ డిమాండ్ తో ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయి. అదే సమయంలో విష్ణు ప్యానల్ సభ్యుల వద్దకే వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు ఒక్కొక్కరు కొంత మంది ఓటర్ల చొప్పున కలుస్తూ వారి ఓట్లు తమకే దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రచారంలో మైండ్ గేమ్

ప్రచారంలో మైండ్ గేమ్

ఇక, ప్రకాశ్ రాజ్ పైన లోకల్ - నాన్ లోకల్ వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రారంభంలో వినిపించిన వ్యాఖ్యలను ఇప్పుడు తిరిగి నటుడు రవిబాబు ప్రస్తావించారు. "మా" ఎన్నికల్లో తెలుగోడిని ఎన్నుకోండి అంటూ పిలుపునిచ్చారు. ఇక, ఈ ఎన్నికల్లో పోటీ పడుతోంది ప్రకాశ్ రాజ్ వర్సస్ విష్ణు అయినా..ఇండస్ట్రీతో సహా చూస్తున్న వారంతా దీనిని చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు మధ్య ఎన్నికలుగా చూస్తున్నారు. చిరంజీవి కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసారు. తన ఛారిటబుల్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

చిరంజీవి పెద్దరికానికి సవాల్ గా...ఎన్నికలు

చిరంజీవి పెద్దరికానికి సవాల్ గా...ఎన్నికలు

కరోనా వేళ సినీ కార్మికులకు అండగా నిలిచారు. దీంతో పాటుగా మెగా ఫ్యామిలీ లో ప్రముఖ హీరోలు ఉన్నారు. ఇక, విధంగా సినీ ఇండస్ట్రీలో చిరంజీవి పెద్దరికం పాత్ర పోషిస్తున్నారనే చర్చ సాగింది. అదే సమయంలో "మా" లో పెద్ద మనుషులు ఎవరూ లేరని మోహన్ బాబు తేల్చి చెప్పారు. చిరంజీవి ఓపెన్ గా ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇవ్వమని కోరలేని పరిస్థితి. కానీ, మోహన్ బాబు నేరుగానే తన కుమారుడిని గెలిపించడంటూ అడుగుతున్నారు. ఇద్దరి మధ్య వార్ హోరా హోరీగా ఉండే అవకాశమే కనిపిస్తోంది.

చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు ఎన్నికలుగా

చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు ఎన్నికలుగా

దీంతో..900 మంది ఓటర్లలో ఎవరు ఎటువైపు మొగ్గుతారనేది కీలకంగా మారింది. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు అసలు తాము ఇప్పుడు జరుగుతన్న రచ్చ చూసి..తాము అసలు ఓటింగ్ కే రామంటూ తేల్చి చెప్పేసారు. మోహన్ బాబు సైతం "మా" పరిస్థితుల పైన తీవ్రంగా స్పందించారు. కానీ, చిరంజీవి ఓపెన్ కాలేదు. నామినేషన్ల ముగింపు సమయం వరకు ఏదైనా రాజీ ఫార్ములా ఉంటుందా అనే ఆసక్తి ఇండస్ట్రీలో కనిపించింది.

ఇద్దరూ తగ్గరు..ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకమే

ఇద్దరూ తగ్గరు..ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకమే

కానీ, అప్పటికే పరిస్థితి రెండు శిబిరాలకు ప్రతిష్ఠాత్మకంగా మారటంతో..ఎవరూ వెనక్కు తగ్గే పరిస్థితి కనిపించ లేదు. జీవిత- హైమా లాంటి వారిని బుజ్జగించి తమ వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అయిన మెగా క్యాంపు మోహన్ బాబును ఒప్పించలేకపోయింది. దీంతో.. ఇక, ఇప్పుడు ఎన్నికలు- ఫలితాలు ఎవరు గెలిచినా..అది అటు చిరంజీవి ..ఇటు మోహన్ బాబు పైన కొద్ది రోజుల పాటు పరోక్షంగా - ప్రత్యక్షంగా ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
MAA elections is turning out to be a prestigious war between Chiranjeevi and Mohanbabu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X