చీటీల పేరిట రూ.5 కోట్లతో పరారైన మహిళ(ఫోటోలు)
విశాఖపట్నం: చీటీల పేరిట ఓ మహిళ శఠగోపం పెట్టింది. సుమారు 150 మంది నుంచి రూ. 5 కోట్లకుపైగా వసూలు చేసి పరారైంది. దీంతో బాధితుల నాల్గవ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అక్కయ్యపాలెం నసింహానగర్‌లో గల సత్యసాయి విహార్‌లో ఉంటున్న మీసాల నిర్మల ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ 15ఏళ్లుగా చీటీలు నిర్వహిస్తోంది.
చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో ఆమె వద్ద రూ. 20 వేల నుంచి రూ. 10 లక్షల వరకు చీటీలు కడుతున్నారు. చీటీలు పాడిన వారికి అధిక వడ్డీ ఇస్తానని ఆ మొత్తం తన వద్దే కొన్నాళ్లుగా ఉంచుకుంటోంది. గత నెల 2వ తేదీన సొంతూరు నారాయణపురం వెళ్లింది. 26వ తేదీ వరకు అందరికీ ఫోన్‌లో అందుబాటులో ఉంది.

చీటీల పేరిట రూ. 5 కోట్లు స్వాహా
తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. గత నెల 26న నరసింహానగర్‌లో తాను ఉంటున్న ఇంటిని బంధువుల పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది.

చీటీల పేరిట రూ. 5 కోట్లు స్వాహా
దీంతో బాధితులంతా ఇంటి వద్ద ఆదివారం ఆందోళన చేశారు. సుమారు రూ. 5 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని బాధితులు అంటున్నారు.

చీటీల పేరిట రూ. 5 కోట్లు స్వాహా
రూ. 60 లక్షలతో రెండు ప్లాట్లు, కూతురి పెళ్లికి రూ. 50 లక్షలు ఖర్చు చేసిందని చెబుతున్నారు. పాలకొండ, నారాయణపురంలో ఆమె పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తెలిపారు.

చీటీల పేరిట రూ. 5 కోట్లు స్వాహా
తమకు న్యాయం చేయాలని బాధితులంతా ఆదివారం రాత్రి నాల్గవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications