ఆ పేలుడు మా పనే: చిత్తూరు జిల్లా పోలీసులకు ఉగ్రవాదుల లేఖ

చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా పోలీసులకు సోమవారం నాడు ఉగ్రవాదుల పేరిట ఓ లేఖ వచ్చింది. అల్ ఖైమా అనే ఉగ్రవాద సంస్థ పేరుతో ఈ లేఖ వచ్చింది. గత వారం చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో వాహనం కింద పేలుడుకు తామే కారణమని అందులో పేర్కొన్నారు.

ఆ తర్వాత కేరళలోని కోర్టులోను బాంబు పేలుడు సంభవించింది. చిత్తూరులో జరిగిన పేలుడు, ఈ పేలుడు రెండూ ఒకే రకంగా ఉన్నాయి. దీంతో, రెండూ ఒకరే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లేఖను, ఇందుకు సంబంధించిన విషయాలను పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు పంపించారు.

Chittoor police receives letter on the name terrorists

అలాగే, కేరళ పేలుడు, ఈ పేలుడు ఒకే రకంగా ఉండటంతో పరిశీలన నిమిత్తం ఓ పోలీసుల బృందాన్ని కొట్టాంకు పంపించారు. పేలుడు ఘటన, ఉగ్రవాదుల పేరిట లేఖను పోలీసులు సీరియస్‌గా తీసుకొని, విచారిస్తున్నారు. ఈ లేఖను ఎవరు రాశారు, ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు అనే విషయాలపై దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+