ముఖ్యమంత్రి కావాలి: వైయస్ జగన్‌ను కలిసిన చోటా కే నాయుడు
Recommended Video

రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కలిశారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో ఆయనను పలువురు ప్రముఖులు కలుస్తున్నారు.
ఇటీవల పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్ తదితరులు కలిశారు. ఇప్పుడు చోటా కే నాయుడు కలిశారు. సోమవారం మండపేట నియోజకవర్గంలో జరుగుతున్న యాత్రలో జగన్‌తో కలిసి కాసేపు నడిచారు. ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చోటా కే నాయుడు మాట్లాడుతూ సుపరిపాలన కావాలంటే జగన్ సీఎం కావాలన్నారు.

అమరణ దీక్ష, యువభేరి సభ పోరాటాలతో ప్రత్యేక హోదా మరుగున పడకుండా సజీవంగా ఉంచింది వైసీపీనే అని ఆ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం అన్నారు. నాటా ఉత్సవాల్లో భాగంగా వైసీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఎన్నారైలతో నిర్వహించిన గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పదవులకన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, హోదా కోసం లోకసభ సభ్యత్వాలను తృణప్రాయంగా త్యజించామన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసి 15 ఏళ్లు హోదా ఇస్తామని నమ్మించి మోసం చేశాయని మిథున్ రెడ్డి విమర్శించారు. తాము రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్ యాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆయన సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications