ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి, భూమన ఎదురు తిరిగారా?: ఆ కోణంలో సిఐడి దర్యాఫ్తు

గుంటూరు: తుని విధ్వంసం కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పైన సీఐడీ అధికారులు మంగళవారం నాడు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆయనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారని తెలుస్తోంది.

భూమన ఉదయం పదకొండు గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6.40 వరకు విచారణ కొనసాగింది. తుని విధ్వంసానికి ముందు కాకినాడ ఎందుకు వెళ్లారని, ఎవరెవరికి ఫోన్లు చేశారని, ఏం మాట్లాడారని ప్రశ్నించారని తెలుస్తోంది.

కాపు గర్జనకు ముందు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఎందుకు కలిశారని అడిగారని తెలుస్తోంది. ముద్రగడకు ఏం సాయం చేశారని, సభను కవర్ చేసేందుకు వినియోగించిన డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారని తెలుస్తోంది.

గుంటూరులో ఇది వరకు విచారించిన ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం, నంబర్‌ వన్‌ టీవీ సీఈవో ముంచాల సుధాకర్ నాయుడు రాజమహేంద్రవరంలో సోమవారం విచారణ సందర్భంగా వెల్లడించిన అంశాల ఆధారంగా భూమనను అధికారులు ప్రశ్నించారు.

భూమన అనుచరుడిగా భావిస్తున్న రాజమహేంద్రవరంకు చెందిన మెహర్ కుమార్‌ను కూడా విచారించారు. ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లికి చెందిన వ్యక్తి. ఇతడిని ప్రశ్నించినప్పుడు ఆసక్తికరమైన విషయాూలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.

ఆ కోణంలో దర్యాఫ్తు

ఈ ఏడాది జనవరి 31న తునిలో కాపు ఐక్య గర్జన జరగడానికి 10 రోజుల ముందు వెుహర్ కుమార్‌కు చెందిన ఫార్చ్యూనర్‌ కారులో భూమన అతడితో కలిసి తుని వెళ్లారు. సభాస్థలంగా నిర్ణయిుంచిన కొబ్బరి తోటలోకి వెళ్లి.. ముద్రగడతో సమావేశమయ్యారని మెహర్ కుమార్ చెప్పారని సమాచారం.

సభా స్థలంలోనే ముద్రగడతో భూమున సమావేశం కావడంతో విధ్వంసానికి అక్కడే వ్యూహం పన్నారేమోననే కోణం నుంచి సీఐడీ దర్యాఫ్తు చేస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా సభా స్థలిగా ఎన్నుకున్న స్థలం కొబ్బరి తోట. అది సభకు అనుకూలమైనది కాదని, కానీ ఆ తోట పక్కనే జాతీయరహదారి, రైల్వే లైన్‌ సమాంతరంగాఉండడంతో ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేశారేమోూననే కోణం నుంచి కూడా విచారిస్తున్నారని అంటున్నారు.

భూమన ఎదురు తిరిగారా?

తనను అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో భూమన సీఐడీ సరైన జవాబులు ఇవ్వకుండా ఎదురుదాడికి దిగినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. కానీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయకుండా అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పి పంపారని అంటున్నారు. విచారణలో ఆయున వెల్లడించిన వివరాలను నమోదు చేసి, త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. నంబర్ వన్‌ టీవీ చానల్‌ అధినేత సుధాకర్ నాయుడును ఈనెల 23న మళ్లీ విచారించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+