టిడిపికి పోసాని కౌంటర్:బాబుతో సహ అంతా దీక్ష, నేను సిద్దమే, దాడులు చేయించలేదా?

Recommended Video

    పరిశ్రమ తరపున దీక్షకు కూర్చొంటానన్న పోసాని కృష్ణమురళి

    హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబునాయుడుతో సహ ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా విజయవాడలో దీక్షకు దిగితే తాను కూడ సీని పరిశ్రమ తరపున దీక్షకు కూర్చొంటానని పోసాని కృష్ణమురళి చెప్పారు. తన సవాల్‌కు టిడిపి నేతలు సిద్దమేనా అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదానే అవసరం లేదని, ప్యాకేజీ సరిపోతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారని సినీ నటుడు పోసాని గుర్తుచేశారు. ప్రధానమంత్రి మోడీతో ఏదో గొడవ వస్తే దాన్ని ఏపీ ప్రజల సమస్యగా మాట్లాడుతున్నారని పోసాని అభిప్రాయపడ్డారు.ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చే్స్తే ఎందుకు అరెస్టులు చేశారు, లాఠీలతో కొట్టారని పోసాని ప్రశ్నించారు.

    ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ నటులు ఎందుకు స్పందించడం లేదంటూ టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన ఆరోపణలకు సినీ నటుడు పోసాని కృష్ణమురళి కౌంటరిచ్చారు. మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన రాజేంద్రప్రసాద్ సినీ నటులపై ధ్వజమెత్తారు.

    టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విమర్శలకు సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఓ తెలుగు న్యూస్‌ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టిడిపి నేతలపై విరుచుకుపడ్డారు. ప్రత్కేక హోదా విషయమై టిడిపి నేతలే మాట మార్చారని ఆయన గుర్తు చేశారు.

     నాతో పాటు దీక్ష చేస్తారా

    నాతో పాటు దీక్ష చేస్తారా

    ప్రత్యేక హోదా విషయమై టిడిపికి సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సవాల్ విసిరారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సహ, ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమరణ నిరహరదీక్షకు దిగితే సినీ పరిశ్రమ తరపున తాను కూడ దీక్షకు దిగుతానని పోసాని కృష్ణమురళి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగానికి కూడ తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. టిడిపి ప్రజా ప్రతినిధులు కూడ సిద్దంగా ఉన్నారా అని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు.

    లాఠీలతో ఎందుకు కొట్టించారు

    లాఠీలతో ఎందుకు కొట్టించారు

    ప్రత్యేక హోదా వల్లే ఏపీ రాష్ట్రానికి న్యాయం జరుగుతోందని ఏపీ రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు చేసిన పార్టీలు, సంఘాల నేతలపై ప్రభుత్వం ఎందుకు దాడులు చేయించిందని సినీ నటుడు పోసాని కృష్ణమురళి టిడిపి నేతలను ప్రశ్నించారు.ఆందోళనకారులను తరిమి తరిమి కొట్టించిన చరిత్ర టిడిపి నేతృత్వంలోని ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.

    బాబు, మోడీ మధ్య గొడవ

    బాబు, మోడీ మధ్య గొడవ

    ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు , ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏదో కారణంగా గొడవలు జరిగితే , ఆ గొడవను రాష్ట్రప్రజల సమస్యగా మార్చేశారని ఆయన అబిప్రాయపడ్డారు.ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీయే కావాలని ఆనాడు ముఖ్యమంత్రి సహ కొందరు టిడిపి నేతలు చేసిన ప్రకటనలను పోసాని కృష్ణమురళి ప్రస్తావించారు. మోడీ, బాబుకు గొడవ రావడంతో ఇప్పడు ప్రత్యేక హోదా అంశాన్ని టిడిపి తెరమీదికి తీసుకువచ్చిందన్నారు.

    బాబును నమ్మి పోరాటం చేయాలా

    బాబును నమ్మి పోరాటం చేయాలా

    పూటకో మాట మార్చుతున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడును చూసి తాము పోరాటం చేయాలా అంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు.సినిమా వాళ్ళకు డబ్బులే లోకమని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ప్రత్యేకహోదా విషయంలో దీక్షకు వచ్చిన సినిమా వాళ్ళను కూడ లాఠీలతో కొట్టించిన ఘనత మీదే కదా పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు.

    ఏపీ ప్రజలకు పోరాటాలు కొత్త కాదు

    ఏపీ ప్రజలకు పోరాటాలు కొత్త కాదు

    ఏపీ ప్రజలకు పోరాటాలు కొత్త కాదని సినీ నటుడు పోసాని కృష్ణమురళి గుర్తు చేశారు. జై ఆంధ్ర, జై సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ప్రజలు పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు . ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమంలో కూడ ప్రజలు పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. అయితే అదే సమయంలో ప్రజలను పాలకులు మోసం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+