దేశంలో ఎక్కడా లేదు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఆర్ నారాయణ మూర్తి ప్రశంసలు
విశాఖపట్నం: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రముఖ సినీనటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారని చెప్పారు. తనకు రాజకీయ పార్టీలతో పనిలేదని, ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ప్రకటిస్తానని చెప్పారు.
ఆదివారం విశాఖపట్నంలో నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. సీఎం జగన్ హయాంలో ఉత్తరాంధ్ర మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు విశాఖపట్నం, తూర్పుగోదావరి సరిహద్దులోని మెట్ట ప్రాంతాల్లో ఒక పంట పండటమే కష్టంగా ఉండేదని అన్నారు. ఏలేరు, తాండవ రిజర్వాయర్లు ఉన్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని గుర్తు చేశారు. కానీ, ఈ సమస్యలను గుర్తించిన సీఎం జగన్.. ఏలేరు నీటిని తాండవకు అనుసంధానం చేసి భవిష్యత్తులో సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారని నారాయణ మూర్తి తెలిపారు.
ప్రజల సమస్యలను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎల్లప్పుడూ తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆర్ నారాయణ మూర్తి స్పష్టం చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళి
Recommended Video
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఆదివారంనాడు సీఎం క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి జగన్ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున, మాదిగ కొర్పొరేషన్ ఛైర్మన్ కనకారావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications