కుక్కలాగా తిరిగి బిజెపికి ఓట్లడిగా, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా: శివాజీ సంచలనం
అమరావతి: 2014 ఎన్నికల సమయంలో బిజెపికి ఓటేయాలని కుక్కలాగా ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగానని సినీ నటుడు శివాజీ చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి ఆనాడు ఎన్నికల హమీని ఇచ్చిన విషయాన్ని శివాజీ గుర్తు చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదంటే బిజెపి నేతలు తమపై దాడులకు దిగుతున్నారని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను బిజెపిలో ఉన్న సమయంలో తనపై దాడికి పాల్పడిన వారెవరూ కూడ బిజెపిలో లేరన్నారు.
ఓ చానెల్ నిర్వహించిన చర్చా వేదికలో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో హీరో శివాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ ప్రసంగంపై కొందరు బిజెపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. శివాజీపై దాడికి ప్రయత్నించారు.
ఈ సమయంలో శివాజీ బిజెపి తీరును తన ప్రసంగంలో ఎండగట్టారు. ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కోరితే తప్పా అని బిజెపి నేతలను ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకొంటామని ఆనాడు బిజెపి హమీ ఇచ్చిన విషయాన్ని శివాజీ గుర్తు చేశారు. ఈ కారణంగానే తాను ఆనాడు బిజెపికి మద్దతుగా ప్రచారం నిర్వహించానని ఆయన గుర్తు చేసుకొన్నారు.

దాడులు చేసినా వెనక్కు వెళ్ళను
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్, పరిశ్రమలు ఇతర సంస్థలను ఇస్తామని ఆనాడు బిజెపి హమీ ఇచ్చిందని సినీ నటుడు శివాజీ చెప్పారు.ఆనాడు బిజెపి ఇచ్చిన హమీ మేరకే తాను ఆనాడు బిజెపికి మద్దుగా నిలిచినట్టు శివాజీ చెప్పారు. ఈ హమీలు ఇచ్చినందుకే 2014లో కుక్కలాగా ఇల్లిల్లూ తిరిగి ఓట్లడిగినట్టుగా శివాజీ చెప్పారు. అయితే ఈ విషయాలను ప్రశ్నిస్తే బిజెపి నేతలు దాడులకు పాల్పడుతున్నారని శివాజీ చెప్పారు. ఎన్ని దాడులకు పాల్పడిన తాను వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదని చెప్పారు.

నేను బిజెపిలో ఉన్నాను
తాను బిజెపిలోనే ఉన్నానని సినీ నటుడు శివాజీ చెప్పారు. తాను బిజెపిలో ఉన్న సమయంలో ఈ రోజు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతన్నవారెవరూ కూడ బిజెపిలో లేరని చెప్పారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఏమైనా చేయండి. నామీద దాడి చేయండి చంపండి. కానీ నా చావుకోసమైనా తెలుగువాళ్లంతా ఒక్కటై తిరగబడతారు" అని బీజేపీపై నిప్పులు చెరిగారు.

ప్రశ్నిస్తే దాడులు చేస్తారా
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే విషయాన్ని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతారా అని సినీ నటుడు శివాజీ బిజెపి నేతలను ప్రశ్నించారు.తాను మరణిస్తే, తనవంటివారు వంద మంది పుడతారని, వారి ఆగ్రహానికి బీజేపీ నాశనమవుతుందని హెచ్చరించారు. హోదాపై తన వాదనేంటో బీజేపీ నాయకులు తెలియజేయాలని, అంతే తప్ప ప్రశ్నించేవారిపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

దమ్ముంటే ప్రత్యేక హోదాపై వాదనను విన్పించండి
ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి బిజెపి నేతలు అలవాటు చేసుకొన్నారని సినీ నటుడు శివాజీ విమర్శలు గుప్పించారు.ఎన్నడూ క్రమశిక్షణ తప్పని వారు ఇప్పుడు ఇలా ఎందుకు అసహనాన్ని పెంచుకుంటున్నారని ప్రశ్నించారు. ఇదా భారతీయ జనతా పార్టీ? ఇలాగేనా మీరు చేసేది? దమ్ముంటే, మీకు చేతనైతే బీజేపీ వాదనను ప్రజలకు వివరంగా చెప్పాలని, చెప్పలేకుంటే తప్పు ఒప్పుకోండని శివాజీ కోరారు.












Click it and Unblock the Notifications