విజయమ్మ మీటింగ్-భారీ ట్విస్టులు : ఆ హీరోల గైర్జాజరు వెనుక జగన్..!! లక్ష్యం నెరవేరిందా..!!
వైఎస్ విజయమ్మ నిర్వహించిన వైఎస్సార్ ఆత్మీయ సమావేశంలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. దాదాపు 350 మందిని విజయమ్మ ఈ సమావేశానికి ఆహ్వానించారు. వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్న వారితో స్వయంగా మాట్లాడారు. అయితే, సమావేశం నిర్ణయం మొదలు..సభ ప్రారంభం అయ్యే వరకూ ఈ సదస్సు విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ చాలా మంది సన్నిహితులే ఉన్నారు. కానీ, ఏపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. వైసీపీ నుంచి ఎవరి ప్రాతినిధ్యం ఈ ఆత్మీయ సదస్సులో కనిపించలేదు.

విజయమ్మ సమావేశానికి దూరంగా వారంతా..
వైఎస్సార్ కేబినెట్ లో పని చేసి ఇతర పార్టీల్లో చేరిన తెలంగాణ నేతలు సమావేశానికి దూరంగానే ఉన్నారు. విజయమ్మ ఈ ఆత్మీయ సదస్సు రాజకీయాలకు అతీతమని చెప్పినా..కాంగ్రెస్ నేతలు మాత్రం పార్టీ తరపున ఎవరూ హాజరు కావద్దని ఆదేశించారు. దీంతో.. కోమటిరెడ్డి మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ వైఎస్సార్ మరణించారని..ఆయన ఎంతో మందిని రాజకీయంగా తీర్చి దిద్దారని కోమటిరెడ్డి తన హాజరు గురించి సమర్ధించుకున్నారు. ఇక, ఏపీ కే చెందిన.. కేవీపీ..రఘువీరా..ఉండవల్లి వంటి వారు హాజరయ్యారు. వ్యాపార వేత్తలు..పలువురు మాజీ సివిల్స్ అధికారులు హాజరయ్యారు.

షర్మిళ చెప్పాలనుకున్నది చెప్పేసారు
ప్రతీ ఒక్కరినీ విజయమ్మ- షర్మిళ పలకరించారు. వైఎస్సార్ ను ప్రస్తుత ప్రధాని మోదీతో సహా..గత ప్రధానులు ఏ రకంగా అభినందించిదీ వివరించారు. తరువాత కొందరు వక్తలు ప్రసంగించి తమకు వైఎస్సార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చివరగా షర్మిల తన తండ్రికి తెలంగాణ ప్రజలతో ఉన్న బంధాన్ని వివరిస్తూ..తన ఒంట్లో వైఎస్సార్ రక్తం ఉందని..తాను ఖచ్చితంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ముగింపు ఉపన్యాసం చేసారు. అందరూ ఊహించింది ఇదే. షర్మిలకు వైఎస్సార్ మద్దతు దారుల నుంచి మరింత సపోర్ట్ కోసమే ఈ సమావేశం అనే అభిప్రాయాలు వినిపించాయి.

సినీ హీరోలకు ఆహ్వానలు వెళ్లినా..వారంతా..
చివరగా షర్మిల చేసిన ప్రసంగంలోనూ అదే భావం వ్యక్తమైంది. ఇక, రాజకీయంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మినహా తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద స్థాయి నేతలు కనిపించ లేదు. అయితే, సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు విజయమ్మ ఆహ్వానాలు పంపారు. అయితే, చిరంజీవి-నాగార్జున తో పాటుగా మోహన్ బాబు, క్రిష్ణ, జయసుధ లాంటి వారు హాజరవుతారని సదస్సు నిర్వాహకులు చెప్పారు. అయితే, వీరు రాకపోవటం వెనుక అసలు కారణం ఏంటనే చర్చ జరుగుతోంది.

హీరోల గైర్హాజరు వెనుక సీఎంతో సంబంధాలే...
వారు వైఎస్సార్ ను అభిమానించే వారే అయినా... జగన్ తో ఉన్న సంబంధాల కారణంగా సదస్సుకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. మోహన్ బాబు..క్రిష్ణ వీడియో- ఆడియో మెసేజ్ లు పంపారు. జగన్ తన చెల్లి షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో షర్మిల పార్టీకి మద్దతు కోసమే వైఎస్సార్ పేరుతో ఈ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో... ఏపీ ముఖ్యమంత్రి తో సత్సంబంధాలు కోరుకుంటున్న ఈ హీరోలు ముందు జాగ్రత్తగానే సమావేశానికి హాజరు కాలేదనే టాక్ టాలీవుడ్ లో ..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
Recommended Video

విజయమ్మ-షర్మిల లక్ష్యం నెరవేరిందా..
అయితే, జగన్ మాత్రం ఈ ఆత్మీయ సదస్సు గురించి ఏ ఒక్కరితోనూ చర్చించలేదని సమాచారం. సదస్సుకు వెళ్లమని లేదా వద్దని చెప్పలేదని ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ సదస్సు ద్వారా విజయమ్మ- షర్మిల లక్ష్యం ఎంత వరకు నెరవేరింది...అనే అంశం పైన రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం సమావేశం మాత్రం రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణమైంది. ఎవరు హాజరయ్యారు అనే అంశం తో పాటుగా విజయమ్మ - షర్మిల ప్రసంగాలే మీద ఎక్కువగా పొలిటికల్ సర్కిల్స్ ఫోకస్ కనిపించింది.












Click it and Unblock the Notifications