మోడీ మెచ్చిన ఆశోక్‌: విఐపీ కల్చర్‌కు దూరంగా, రాజ కుటుంబం నుండి వచ్చి ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం: కేంద్ర విమానయానశాఖ మంత్రి ఆశోక్‌గజపతిరాజు సాధారణ పౌరులానే జీవనం సాగిస్తున్నారు. స్వతహగా రాజుల కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఆయన వ్యవహరశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.కేంద్ర మంత్రిగా కూడ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశోక్ మాత్రం సాధారణ ప్రయాణీకుల తరహలోనే విమానాల్లో ప్రయాణం చేస్తారు. ఆశోక్ గజపతిరాజును ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రులకు మోడీ సూచించడం గమనార్హం.

  Shivsena MPs Surrounded Civil Aviation Minister Ashok Gajapathi Raju In Parliament - Oneindia Telugu

  విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఆశోక్‌గజపతి రాజు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన టిడిపి నుండి ఎమ్మెల్యేగా పలు దఫాలు విజయం సాధించారు. ఆశోక్‌గజపతిరాజుది రాజవంశం. రాజులూ, రాజ్యాలు పోయాయి.కానీ, వాటి గుర్తులు ఇంకా జిల్లాలో ఉన్నాయి.

  మోడీ మంత్రివర్గంలో ఆశోక్‌గజపతిరాజు కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వ హయంలో ఆశోక్‌గజపతిరాజు మంత్రిగా ఉన్న కాలంలో కూడ ఇదే రకంగా ఉండేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

  ప్రత్యేక సదుపాయాలకు దూరంగా మంత్రి ఆశోక్ గజపతిరాజు

  ప్రత్యేక సదుపాయాలకు దూరంగా మంత్రి ఆశోక్ గజపతిరాజు

  కేంద్ర మంత్రిగా ఆశోక్‌గజపతిరాజుకు ప్రభుత్వం అనేక అనేక వెసులుబాట్లు కల్పించింది. తాను ఎక్కాల్సిన విమానం వద్దకు నేరుగా ప్రత్యేక వాహనంలో వెళ్లవచ్చు. తనిఖీలు లేకుండానే విమానాశ్రయంలోకి వెళ్లవచ్చు. కానీ ఆయన అలా చేయరు. అందరు ప్రయాణికులతోపాటు వరుసలో నిలబడతారు. రెండు చేతులు పైకెత్తి చెకింగ్‌ చేయించుకుంటారు. మీ డ్యూటీ మీరు చేయండి, తప్పులేదంటూ సెక్యూరిటీ సిబ్బందికి సూచిస్తారు మంత్రి.

   మెట్రోకార్డు ఉన్న కేంద్ర మంత్రి

  మెట్రోకార్డు ఉన్న కేంద్ర మంత్రి

  విమానాశ్రయానికి కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజు మెట్రో రైలులో ప్రయాణిస్తారు.

  మిగిలిన ప్రయాణికులతోపాటు క్యూలో నిల్చుని... మెట్రో కార్డు (టికెట్‌) పంచ్‌ చేయించుకుని గేటు దాటి వెళతారు. ఇతర కేంద్ర మంత్రులూ ఏరోసిటీలో ప్రయాణించినప్పటికీ... ఇలా క్యూలో నిలబడటం, టికెట్‌ పంచ్‌ చేయించుకోవడం ఉండదు. వారికోసం ముందుగానే గేట్లు తెరుచుకుంటాయి. ఇంకా చెప్పాలంటే... మెట్రో కార్డు ఉన్న ఏకైక కేంద్ర మంత్రి అశోక్‌.

   సాధారణ క్లాస్‌లోనే మంత్రి ఆశోక్ ప్రయాణం

  సాధారణ క్లాస్‌లోనే మంత్రి ఆశోక్ ప్రయాణం

  ఏ విమానంలోనైనా ఎగ్జిక్యూటివ్‌ లేదా బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించే అవకాశం అశోక్‌ గజపతిరాజుకు ఉంటుంది. ఆయన దీనిని కూడా ఉపయోగించుకోరు. సాధారణ క్లాస్‌లోనే ప్రయాణిస్తారు. ఈ తరహ వ్యక్తిత్వం ఉన్న ఆశోక్‌గజపతిరాజుకు మోడీ వద్ద ప్రత్యేక మార్కులు పడ్డాయి. ఆశోక్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన మంత్రివర్గసహచరులకు సూచించారు.

  ఆశోక్‌పై మోడీ ప్రశంసలు

  ఆశోక్‌పై మోడీ ప్రశంసలు

  కేబినెట్‌ సమావేశాల్లో అశోక్‌ గజపతిరాజు ఏదైనా ఒక అభిప్రాయాన్ని వెల్లడిస్తే దానికి ఆయన తలూపుతారే తప్ప పెద్దగా వ్యతిరేకించరని తోటి కేంద్ర మంత్రులు చెబుతుంటారు. ఆశోక్‌గజపతిరాజు సింప్లిసిటీని అందరూ అనుసరిస్తే బాగుంటుందని మోడీ అప్పుడప్పుడు తన సహచరులకు చెబుతుంటారు.తనను ఎన్నుకొన్న ప్రజలకు అసౌకర్యం కల్గించకుండా ఉండాలనేదే తన అభిప్రాయమని మంత్రి ఆశోక్‌గజపతిరాజు చెబుతుంటారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  At a time when much heat has been generated over the special privileges enjoyed by members of the Parliament and other VIPs, civil aviation minister Ashok Gajapathi Raju has set a good example with his simplicity, that perhaps ought to be emulated by other ministers, MPs and VIPs.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి