గుంటూరులో హైటెన్షన్: టీడీపీ-బీజేపీ మధ్య చిచ్చుపెట్టిన ఛైర్మన్ పదవి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: గుంటూరు అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార మిత్రపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చును రాజేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అధికార పార్టీతో విభేదిస్తున్న బీజేపీ తాజాగా గుంటూరు అర్బన్ బ్యాంకు ఛైర్మన్ పదవి కోసం ఇరు పార్టీలు ఘర్షణకు దిగాయి.

బుధవారం ఉదయం గుంటూరు పట్టణంలోని అర్బన్ బ్యాంకు కార్యాలయం వద్దకు చేరుకున్న ఇరు పార్టీలకు చెందిన నేతలు ఛైర్మన్ పదవి కోసం ఇరు పార్టీలు వేర్వేరుగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Clash Between BJP and TDP over urban

దీంతో ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. అనంతరం ఇరు వర్గాలు మధ్య తోపులాట చోటు చేసుకోవడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరుపార్టీలకు చెందిన నేతలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎంపీ రాయపాటిని కలిసిన హోంమంత్రి చినరాజప్ప

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును ఏపీ హోంమంత్రి చినరాజప్ప బుధవారం ఉదయం పరామర్శించారు. గుంటూరు పట్టణంలోని రాయపాటి నివాసానికి వెళ్లిన ఆయన ఇటీవల మరణించిన ఆయన సతీమణి లీలాకుమారి చిత్రపటానికి నివాళులర్పించారు.

అనంతరం రాయపాటి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరుకు వచ్చి రాయపాటి కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Clash Between BJP and TDP over urban bank chairman post in guntur.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి