చలాన్: ఎస్ఐలపై దాడి, మహిళల ఆందోళన(పిక్చర్స్)
హైదరాబాద్: రాంగ్‌రూట్‌లో వచ్చినందుకు చలాన రాయడంతో వాహనదారుడికి, ట్రాఫిక్ పోలీసులకు మధ్య చెలరేగిన వాగ్వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. వాహనదారుడు కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి చలాన రాసిన ట్రాఫిక్ ఎస్ఐను అసభ్య పదజాలంతో దూషించి, దాడి చేయడమే కాకుండా కొత్తపేట చౌరస్తాలో ఆందోళనకుదిగాడు. ఇదిలా ఉండగా సందట్లో సడేమియా అన్నట్లుగా మరో యువకుడు స్నేహితులతో కలిసి కొత్తపేట పివిటి మార్కెట్ వద్ద విధి నిర్వహణలో ఉన్న మరో ట్రాఫిక్ ఎస్ఐపై దాడికి దిగాడు. ఈ రెండు ఘటనల్లో ట్రాఫిక్ ఎస్ఐలపై దాడికి పాల్పడ్డ యువకులపై కేసులు నమోదయ్యాయి.
మోహన్‌నగర్‌లోని రామలింగేశ్వరనగర్ కాలనీకి చెందిన సోదరులు కరణ్‌మోహన్‌రాజు, కరణ్ కార్తీక్ గురువారం ద్విచక్ర వాహనంపై కొత్తపేట నుంచి ఎల్‌బినగర్ వైపు వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా పాత కోర్టుల సమీపంలో రాంగ్‌రూట్‌లో వెళ్తున్న వీరిని అక్కడ విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ మధుసూదన్‌రావు ఆపి రూ. 1200 చలాన విధించారు. తమ వద్ద అంత డబ్బు లేదంటూ... అయినా రాంగ్‌రూట్‌లో వెళ్తే అంత మొత్తం చలాన విధిస్తారా అంటూ సోదరులిద్దరు ఎస్ఐతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన ఎస్ఐ బైక్‌కు తాళం వేసి, చలాన చెల్లించిన తర్వాత వచ్చి తీసుకెళ్లమంటూ తేల్చి చెప్పాడు.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
రాంగ్‌రూట్‌లో వచ్చినందుకు చలాన రాయడంతో వాహనదారుడికి, ట్రాఫిక్ పోలీసులకు మధ్య చెలరేగిన వాగ్వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
వాహనదారుడు కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి చలాన రాసిన ట్రాఫిక్ ఎస్ఐను అసభ్య పదజాలంతో దూషించి, దాడి చేయడమే కాకుండా కొత్తపేట చౌరస్తాలో ఆందోళనకుదిగాడు.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
ఇదిలా ఉండగా సందట్లో సడేమియా అన్నట్లుగా మరో యువకుడు స్నేహితులతో కలిసి కొత్తపేట పివిటి మార్కెట్ వద్ద విధి నిర్వహణలో ఉన్న మరో ట్రాఫిక్ ఎస్ఐపై దాడికి దిగాడు. ఈ రెండు ఘటనల్లో ట్రాఫిక్ ఎస్ఐలపై దాడికి పాల్పడ్డ యువకులపై కేసులు నమోదయ్యాయి.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
మోహన్‌నగర్‌లోని రామలింగేశ్వరనగర్ కాలనీకి చెందిన సోదరులు కరణ్‌మోహన్‌రాజు, కరణ్ కార్తీక్ గురువారం ద్విచక్ర వాహనంపై కొత్తపేట నుంచి ఎల్‌బినగర్ వైపు వెళ్తున్నారు.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
రంగారెడ్డి జిల్లా పాత కోర్టుల సమీపంలో రాంగ్‌రూట్‌లో వెళ్తున్న వీరిని అక్కడ విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ మధుసూదన్‌రావు ఆపి రూ. 1200 చలాన విధించారు.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
తమ వద్ద అంత డబ్బు లేదంటూ... అయినా రాంగ్‌రూట్‌లో వెళ్తే అంత మొత్తం చలాన విధిస్తారా అంటూ సోదరులిద్దరు ఎస్ఐతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన ఎస్ఐ బైక్‌కు తాళం వేసి, చలాన చెల్లించిన తర్వాత వచ్చి తీసుకెళ్లమంటూ తేల్చి చెప్పాడు.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
సోదరులిద్దరూ ఇంటికి ఫోన్ చేసి కుటుంబసభ్యులను సంఘటన స్థలానికి పిలిపించారు. అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు ఎస్ఐ మధుసూదన్‌తో ఘర్షణకు దిగి అసభ్య పదజాలంతో దూషించి దాడికి దిగారు.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
వివాదం పెద్దదవుతుండడంతో విషయం తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు అక్కడకు చేరుకుని కరణ్‌మోహన్‌రాజు, కార్తీక్ రాజును చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
కరణ్, కార్తీక్‌ను వదిలి వేయాలంటూ వారి కుటుంబసభ్యులు కొత్తపేట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా స్థానిక నాయకులు అక్కడ బైఠాయించి ధర్నా చేపట్టారు.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొత్తపేట చౌరస్తాలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
ఎస్ఐ మధుసూదన్ ఫిర్యాదుతో దాడికి పాల్పడ్డ వారిపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

చలాన్ వివాదం: ఎస్ఐపై దాడి
మరో వైపు కొత్తపేట చౌరస్తాలో ఆందోళన కొనసాగుతుండగానే పివిటి మార్కెట్ సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ రికవరీ వాహన ఆర్ఎస్ఐ మల్లేష్‌పై ప్రేమ్‌కుమార్‌గుప్త, అతని అనుచరులు దాడికి దిగారు.
సోదరులిద్దరూ ఇంటికి ఫోన్ చేసి కుటుంబసభ్యులను సంఘటన స్థలానికి పిలిపించారు. అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు ఎస్ఐ మధుసూదన్‌తో ఘర్షణకు దిగి అసభ్య పదజాలంతో దూషించి దాడికి దిగారు. వివాదం పెద్దదవుతుండడంతో విషయం తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు అక్కడకు చేరుకుని కరణ్‌మోహన్‌రాజు, కార్తీక్ రాజును చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కరణ్, కార్తీక్‌ను వదిలి వేయాలంటూ వారి కుటుంబసభ్యులు కొత్తపేట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా స్థానిక నాయకులు అక్కడ బైఠాయించి ధర్నా చేపట్టారు.
పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొత్తపేట చౌరస్తాలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎస్ఐ మధుసూదన్ ఫిర్యాదుతో దాడికి పాల్పడ్డ వారిపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మరో వైపు కొత్తపేట చౌరస్తాలో ఆందోళన కొనసాగుతుండగానే పివిటి మార్కెట్ సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ రికవరీ వాహన ఆర్ఎస్ఐ మల్లేష్‌పై ప్రేమ్‌కుమార్‌గుప్త, అతని అనుచరులు దాడికి దిగారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ప్రేమ్‌కుమార్ గుప్త గతంలో ఆర్ఎస్ఐ మల్లేష్ తనకు చలాన రాయడంతో ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎస్ఐపై దాడికి దిగాడు. దీంతో ఆర్ఎస్ఐ మల్లేష్ తనపై ప్రేమ్‌కుమార్‌గుప్త, మరో ముగ్గురు దాడికి దిగారంటూ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications