పిఠాపురంలో వర్మ మార్క్ రాజకీయం - జనసేనకు ఇక..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి లోని పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాము లుకా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేసాయి. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ లో వర్మ గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ స్థానిక కేడర్ ఆగ్రహంతో ఉంది. కొంత కాలంగా వర్మకు పిఠాపురంలో ప్రాధాన్యత లభించికపోయినా.. పొత్తు కోసం సర్దుకుపో పోయామని చెబుతున్న ఆయన మద్దతు దారులు.. ఇప్పుడు మాత్రం రూటు మార్చారు. తాజాగా పిఠాపురంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

మారుతున్న లెక్కలు
పిఠాపురంలో 2024 ఎన్నికల్లో పవన్ కోసం టీడీపీ నేత వర్మ తన సీటు త్యాగం చేసారు. కూటమి అధికారంలోకి వస్తే తొలి విడత లోనే ఎమ్మెల్సీ చేస్తామని వర్మకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు. ఆ ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం వర్మ పని చేసారు. తాజాగా జనసేన సభలో నాగబాబు తన సోదరుడు పవన్ గెలుపు వెనుక ఎవరైనా ఉన్నామని భావిస్తే వారి ఖర్మ అంటూ చేసిన వ్యాఖ్యలు టీడీపీ కేడర్ కు ఆగ్రహం తెప్పించాయి. నియోజకవర్గంలో వర్మ పైన సానుభూతి కి కారణమయ్యాయి. గత పది నెలల కాలంలో పలు సందర్భాల్లో వర్మకు తగిన ప్రాధాన్యత లేక పో యినా.. తాము పొత్తు కారణంగా సర్దుబాటు ధోరణితో వ్యవహరించామని టీడీపీ కార్యకర్తలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది.

టీడీపీ వర్సస్ జనసేన
తాజాగా నాగబాబు వ్యాఖ్యల తరువాత వర్మ ఎక్కడా స్పందించ లేదు. కేడర్ మాత్రం నాగబాబు వ్యాఖ్యలను తప్పు బడుతోంది. ఇక, నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో ఆర్ ఓ ప్లాంట్ ఓపెనింగ్ లో టీడీపీ, జనసేన కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను కార్యక్రమానికి పిలవకపోవడంతో టీడీపి కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేసా రు. దీంతో, మధ్యలోనే కార్యక్రమం నుండి పిఠాపురం జనసేన ఇంఛార్జి మారెడ్డి శ్రీనివాస్ వెళ్లి పోయారు. తామంతా వర్మ చెప్పిన కారణంగానే జనసేనకు ఓటు వేసామని టీడీపీ కేడర్ నినాదాలు చేసారు. జనసేన ఇన్‌చార్జ్ శ్రీనివాస్‌ను అడ్డుకున్నారు. దీంతో, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

Take a Poll

clashes-between-pithapuram-tdp-and-janasena-cadre-in-gollaprolu-mandal

వర్మ నెక్స్ట్ స్టెప్
వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవటం .. ఇటు జనసేన నేతలు వర్మకు సరైన ప్రాధాన్యత కల్పిం చకపోవటం పైన టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. వర్మ సైలెంట్ గా తన పని తాను చేసుకొని వెళ్తున్నారు. కేడర్, స్థానిక ప్రజల్లో వర్మకు మద్దతు పెరుగుతోంది. వర్మ మాత్రం నియోజకవర్గానికి సేవ చేయటమే తనకు అన్నింటికన్నా ఇష్టమని చెబుతున్నారు. నాగబాబు వ్యాఖ్యల తరువాత వర్మ ఇప్పటి వరకు వాటి పైన స్పందించలేదు. ఉగాదికి కూటమి నామినేటెడ్ పదవులను మలి విడత జాబితా ప్రకటించేందుకు సిద్దమైంది. ఈ లిస్టులో వర్మకు రాష్ట్ర స్థాయి పదవి ఉంటుందనే వాదన వినిపిస్తోంది. అయితే, వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం ద్వారా పిఠాపురంలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందనే వాదన ఉంది. దీంతో.. వర్మకు పదవి విషయంలో సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+