నేషనల్ క్రష్ రష్మిక వెనక భారీ కుట్ర? అతడేనా?
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. యానిమల్ సినిమాను పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉంది. వెంకీ కుడుమల డైరెక్షన్ లో నితిన్ సరసన హీరోయిన్ గా ఒక సినిమా చేయనుందంటూ వార్తలు వచ్చాయి. గతంలో వీరి కాంబినేషన్ లో భీష్మ వచ్చింది. మళ్లీ అదే సూపర్ హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేయాలను మేకర్స్ భావించగా రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ లో రూపుదిద్దుకోనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. డేట్స్ అడ్జస్ట్ కావడంలేదని, అందుకే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే రష్మిక ఇలా తప్పుకోవడం వెనక ఆమెపై భారీ కుట్ర జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

కొద్దిరోజుల క్రితం రష్మికకు, ఆమె మనేజర్ కు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. హీరోయిన్ రష్మికకు తెలియకుండా రూ.50 లక్షలు వాడుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె వెంటనే అతడిని పనిలోనుంచి తీసేసిందంటూ టాక్ నడిచింది. అయితే ఇందులో నిజం లేదని, తామే ప్రొఫెషనల్ గా విడిపోయామని రష్మిక ప్రకటించింది. అయితే అదంతా మనసులో పెట్టుకొని సదురు మేనేజర్ రష్మికపై కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. నితిన్ సినిమాలో రష్మికకు అవకాశం చేజారడానికి కూడా కారణం అతనేనని అంటున్నారు. తెలుగులో రష్మికకు అవకాశాలు లేకుండా చేసేందుకు ఆమె బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని చూస్తోందని, తెలుగులో సినిమాలు చేసే ఉద్దేశం లేదంటూ ప్రచారం చేశాడు. నితిన్ సినిమాలో మృణాల్, శ్రీలీలను తీసుకోవాలంటూ సూచించింది కూడా అతనే అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే రష్మిక స్వయంగా చెప్పేంతవరకు ఎదురుచూడటమే.












Click it and Unblock the Notifications