వైసీపీ ఎమ్మెల్సీల్లో టెన్షన్..ఆశావాహుల్లోనూ: జగన్ ఇచ్చిన హామీ ఏంటి: ఆ నియామకాల్లో వారికే ప్రాధాన్యం

ఏపీలో శాసనమండలి రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం మండలిలో టీడీపీ మెజార్టీ కారణంగా ప్రభుత్వ బిల్లులకు అడ్డుకుంలు ఏర్పడు తున్నాయి. అయితే, వైసీపీకి ప్రస్తుతం మండలిలో తొమ్మది మంది సభ్యులే ఉన్నారు. మండలి రద్దు ప్రతిపాదనల సమయంలో సీఎం జగన్ ముఖ్యనేతలు..ఎమ్మెల్సీలతో మంతనాలు చేసారు. ఆ సమయం లో మండలిలో వైసీపీకి ఆధిపత్యం దక్కేదెన్నడు అనే అంశం మీద చర్చ సాగింది.

2021 జూన్ నాటికి 27 మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేస్తారని.. అందులో 25 స్థానాల వరకు వైసీపీకే దక్కే అవకాశం ఉందని లెక్కలు తేల్చారు. అప్పటి వరకు ఇబ్బందులు పడాల్సిందేనా అనే అసహనం వ్యక్త అయింది. ఇదే సమయంలో మండలిలో సొంత పార్టీ ఎమ్మెల్సీకు సీఎం హామీ ఇచ్చారు. వారు సైతం సీఎం ఏ నిర్ణయం తీసు కున్నా..మద్దతుగా నిలుస్తామని చెబుతున్నా..ఆశావాహుల్లో మాత్రం టెన్షన్ కనిపిస్తోంది. ఇంతకీ..సీఎం జగన్ వారికి ఇచ్చిన హామీ ఏంటి...

మండలిలో వైసీపీ ఆధిపత్యం వచ్చేదాకా..

మండలిలో వైసీపీ ఆధిపత్యం వచ్చేదాకా..

శాసనమండలిలో ప్రస్తుతం మొత్తం 58 సభ్యులు ఉన్నారు. అందులో 34 మంది సభ్యుల మద్దతు టీడీపీకి ఉంది. అధికార వైసీపీకి కేవలం 9 మంది సభ్యులే ఉన్నారు. ఇక, మండలి రద్దు ప్రతిపాదన పైన పార్టీలో ముఖ్య నేతలతో చర్చించే సమయంలో లెక్కలు..అంచనాలు తెర మీదకు వచ్చాయి. 2021 జూన్ నాటిికి దాదాపు 27 మంది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయాల్సి ఉంది. వారిలో ఎమ్మెల్యేల కోటాలో ఉన్న 8 మంది.. స్థానిక సంస్థల కోటాలో 11 మంది.. గవర్నర్ నామినేటెడ్ కోటాలో 6 అరు పదవులు వైసీపీకి దక్కనున్నాయి. అయితే, అప్పటి వరకు శాసనసభలో ఆమోదించి బిల్లులు పంపినా..ఇబ్బందు లే కదా అనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే, టీడీపీకి ఆ అవకాశం ఇవ్వటం ముఖ్యమంత్రి ససేమిరా ఇష్టం లేనట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో..మండలి రద్దు ప్రతిపాదనల పైన ఎమ్మెల్సీలతోనూ చర్చించాలని నిర్ణయించి..వారితో ఇదే అంశం పైన వారి నుండి అభిప్రాయ సేకరణ చేసారు.

సిట్టింగ్ ఎమ్మెల్సీలు.. ఆశావాహుల్లో టెన్షన్..

సిట్టింగ్ ఎమ్మెల్సీలు.. ఆశావాహుల్లో టెన్షన్..

ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ నుండి తొమ్మది మంది సభ్యులున్నారు. అదే విధంగా 2019 ఎన్నికల సమయంలో పార్టీ టిక్కెట్లు ఇవ్వలేకపోయిన అనేక మంది నాడు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామ ని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంమహ్మద్ లోకి వచ్చిన తరువాత మోపిదేవి వెంకటరమణ.. మహ్మద్ ఇక్బాల్..చల్లా రామక్రిష్టారెడ్డికి అవకాశం ఇచ్చారు. మండలి నుండే డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర బోస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, త్వరలోనే తమకు మండలిలో సభ్యులుగా అవకాశం దక్కుతుందని పలువురు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఆకస్మికంగా ముఖ్యమంత్రి జగన్ ఏకం గా మండలి రద్దు దిశగా అడుగులు వేస్తున్నారు. తుది నిర్ణయం తీసుకోనప్పటికీ..ముఖ్యమంత్రి ఆలోచన మాత్రం రద్దు దిశగానే ఉందని తెలుస్తోంది. దీంతో..ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా ఉన్న వారితో సీఎం శాసనసభా ఛాంబర్ లో సమావేశమయ్యారు. వారంతా సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా..మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో వారికి మరో విధంగా ప్రాధాన్యత కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చిన ట్లుగా తెలుస్తోంది.

ఆ నియామకాల్లో వారికే ప్రాధాన్యం..

ఆ నియామకాల్లో వారికే ప్రాధాన్యం..

ముఖ్యమంత్రి ఆలోచనలకు తగినట్లుగా మండలి రద్దు అయితే...ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి ఏ రకంగా ప్రత్నామ్నాయ పదవులు ఇవ్వాలనే దాని పైన వైసీపీ అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులోనే..రాష్ట్రంలోని 13 జిల్లాలకు నాలుగు జోన్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి జోనుకూ ప్రత్యేకంగా ఓ తొమ్మిది మంది సభ్యులతో బోర్డ్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రతి బోర్డులోనూ ఛైర్మనుగా సీఎం, వైస్ ఛైర్మనుగా మరో వ్యక్తికి అవకాశం కల్పిస్తారు. బోర్డులో సభ్యులుగా ఓ ఎంపీ, ఇద్దురు ఎమ్మెల్యేలు, మరో నలుగురు ప్రతినిధులకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఇప్పుడు ఈ బోర్డుల సంఖ్యను ఆరు వరకు పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. బోర్డు వైస్ ఛైర్మన్ గా మండలి రద్దు చేస్తే పదవులు కోల్పోయే వారితో భర్తీ చేయాలనేది వైసీపీ తాజా నిర్ణయంగా విశ్వసనీయ సమాచారం. ఇక, పదవులు దక్కని నేతలకు సైతం ఈ బోర్డుల్లో ప్రాధాన్యత కల్పించి..వారి ప్రాంతాల డెవలప్ మెంట్ లో కీలక భూమిక పోషించే అవకాశం కల్పించటం ద్వారా వారికి గుర్తింపు వస్తుందని చెబుతున్నారు. దీంతో..మండలి రద్దు పైన తుది నిర్ణయం తీసుకున్న తరువాత... వీటికి సంబంధించి అధికారిక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+