చంద్రబాబుకు చేదు అనుభవం: మట్టిలో కూరుకుపోయిన ఐదు కోట్ల బస్సు
అమరావతి: తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు మంగళవారం రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి వచ్చిన సీఎం చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. తాత్కాలిక సచివాలయం బ్లాక్ వద్దకు వెళ్లే సమయంలో ముఖ్యమంత్రి బస్సు మట్టిలో కూరుకుపోయింది.
గమ్యానికి సుమారు 100 అడుగుల దూరంలో బస్సు కూరుకుపోవడంతో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, అధికారులు బస్సు దిగి నడుచుకుంటూ సచివాలయ బ్లాక్ వద్దకు వెళ్లారు. బస్సును వెనుక భాగంలో క్రేన్ ద్వారా బెల్ట్ కట్టి లాగినప్పటికీ బస్సు మొరాయించింది.
దీంతో చేసేదేమీలేక ముఖ్యమంత్రి వాహన శ్రేణిలోని వేరే కారులో విజయవాడకు వెళ్లారు. కాగా తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం మరింతగా పెంచాలని చంద్రబాబు నిర్మాణ సంస్ధలకు ఆదేశించారు. నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.
నాలుగో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్లోరింగ్ వేయకపోవడం గురించి ప్రశ్నించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఐదవ బ్లాక్‌లోని మొదటి ఫ్లోర్‌కు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లి పరిశీలించారు. నాలుగు, ఐదు అంతస్తుల్లో జరుగుతున్న పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా, అంతకుముందు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతానికి రెండు హైటెక్ బస్సుల్లో వచ్చిన జపాన్ బృందం కిందకు దిగలేదు. కేవలం బస్సుల్లోంచి సచివాలయ భవనాలను చూసి వివరాలు తెలుసుకుని వెనుదిరిగింది. చంద్రబాబు అక్కడికి చేరుకోకముందే జపాన్ బృందం వచ్చి వెళ్లిపాయరు.
జపాన్ బృందం వెళ్లిపోయాక అక్కడికి చేరుకున్న చంద్రబాబు అధికారులతో సమావేశమై సచివాలయ నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించారు. ఉద్దండ్రాయునిపాలెం వెళ్లిన జపాన్ బృందం బస్సులు దిగినప్పటికీ కేవలం ఐదు నిముషాల్లోనే అమరావతి రాజధాని నమూనాను పరిశీలించి వెనుదిరిగారు.
ఆ తర్వాత అక్కడ నుంచి అమరావతికి వెళ్లి ధ్యానబుద్ద ప్రాజెక్టును చూస్తారని అనుకున్నారు. అయితే వారు అక్కడికి కూడా వెళ్లకపోవడం విశేషం. రోహిణి కార్తె రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా పెరిగాయి. దీంతోనే జపాన్ బృందం బస్సులు దిగే సాహసం చేయలేక పోయిందని అధికారులు భావిస్తున్నారు.
రాజధాని అమరావతిలో పెట్టుబడుల కోసం ఏపీకి వచ్చిన 75 మంది జపాన్ పారిశ్రామికవేత్తల బృందం రెండు రోజుల పాటు ఇక్కడే ఉంది. జపాన్ బృందంతో చంద్రబాబు సోమవారం విజయవాడ గేట్‌వే హోటల్‌లో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
విభజన తర్వాత ఇబ్బంది పడ్డాం: చంద్రబాబు
విభజన నేపథ్యంలో ఈ రెండు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు. 2022 నాటికి ఏపీ దేశంలో టాప్ 3లో, 2029 నాటికి టాప్ 1లో ఉండాలన్నారు. రాష్ట్ర రెవెన్యూ 3.1 శాతం పెరిగిందన్నారు. రొటీన్ అజెండాతో కాకుండా వినూత్నంగా ఆలోచించాలన్నారు. విజన్ 2050ని టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు.
మూడు నెలలకోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోటీతత్వం పెరగాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అద్భుతంగా పని చేశామన్నారు. అభివృద్ధిలో జిల్లాలు పోటీ పడాలన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఉత్తరాంధ్ర జిల్లాలు ప్రథమ, చివరి స్థానాల్లో ఉన్నాయన్నారు.
ప్రభుత్వ ఆలోచనలు, ఉద్దేశ్యాలు కింది వరకు వెళ్లాలన్నదే తన ఉద్దేశ్యమని చెప్పారు. విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. చంద్రబాబు అభివృద్ధికి సంబంధించిన పుస్తకాన్ని బుధవారం నాడు విడుదల చేశారు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications