ఇక ఇంటికే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆన్ లైన్ సేవల్లో కీలక మార్పులు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు రకాల సేవలను ఆన్‌లైన్‌ అందుబాటు లోకి తెచ్చారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆన్‌లైన్‌ సేవల పైన అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్‌లైన్‌ లోనే అమలు చేయాలని స్పష్టం చేసారు. ఆర్టీసీలో సేవలు మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా డ్రోన్ సేవలు మ‌రింత విస్తృత‌ప‌ర‌చాలని సూచించారు. రిజిస్ట్రేషన్ విషయంలోనూ కీలక మార్పులకు కసరత్తు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ సేవల పెంపు పైన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వ‌చ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరుల‌కు అన్ని సేవ‌లూ ఆన్‌లైన్‌లోనే అందించాల‌ని ఆదేశించారు. ఈ దిశ‌గా ఆయా శాఖ‌ల‌న్నీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఆన్‌లైన్‌ సేవ‌లు అందించ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు పార‌ద‌ర్శ‌కంగా అంద‌డంతో పాటు వారిలో ప్ర‌భుత్వ పని తీరు ప‌ట్ల సంతృప్త స్థాయి పెరుగు తుంద‌న్నారు. ఇప్ప‌టికీ కొన్ని శాఖ‌లు భౌతికంగానే సేవ‌లందిస్తున్నాయ‌ని అలాంటి శాఖ‌లు వెంట‌నే త‌మ పంథా మార్చుకుని ప్ర‌జ‌ల‌కు ఆన్‌లైన్‌లో సేవ‌లందించేలా ఏర్పాట్లు చేసుకోవాల‌ని ముఖ్యమంత్రి అన్నారు. ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు తిర‌గ‌న‌వస‌రం లేకుండా మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా అంద‌జేస్తున్నామ‌ని, దీనిపై ప్ర‌జ‌ల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ముఖ్యమంత్రి చెప్పారు.

cm-chandra-bab-key-directions-for-officials-over-implementation-of-online-services

కాగా, ఇక నుంచి రిజిస్ట్రేష‌న్ల అనంతరం డాక్య‌మెంట్లు కొరియ‌ర్ ద్వారా నేరుగా సంబంధిత వ్యక్తుల ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆర్టీసీ సేవ‌లు మ‌రింత మెరుగ‌య్యేలా చూడాల‌ని నిర్దేశించారు. బ‌స్టాండు ప్రాంగణం, పరిసరాలు, టాయ్‌లెట్ల వ‌ద్ద పరిశుభ్ర‌త పాటించే విధంగా చర్యలు ఉండాలని సీఎం అన్నారు. డ్రోన్ సేవ‌లు మ‌రింత విస్తృత ప‌రిచాలని, ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఒక మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భ‌విష్య‌త్తులో డ్రోన్ల ఉప‌యోగం గ‌ణ‌నీయంగా పెరుగుతుంద‌న్నారు. పురుగు మందుల వినియోగం త‌గ్గించేందుకు డ్రోన్లను ఎలా వాడుకోవచ్చోననే అంశంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. పారిశుధ్యం నిర్వ‌హ‌ణ ద్వారా వ్యాధుల వ్యాప్తి లేకుండా చేయవచ్చని తెలిపారు. కొన్ని జిల్లాల్లో కొంత‌మంది అధికారులు మంచి కార్య‌క్ర‌మాల‌ను అమలు చేస్తున్నారని ..అందులో భాగంగా అమలు చేస్తున్న
మంచి ప‌ద్ద‌తుల‌ను గుర్తించి మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేయాలని సీఎం సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+