తిరుమలలో బొత్సా కు కీలక అధికారి జీ హుజూర్ - సీఎం సీరియస్..!!
తిరుమలలో వైసీపీ మాజీ మంత్రుల హవా తగ్గటం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు అయినా వైసీపీ ముఖ్య నేతలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వటం తెర మీదకు వచ్చింది. మాజీ మంత్రి బొత్సా లేఖలకు తిరుమల దర్శనాల్లో రెడ్‌కార్పెట్ పై సీఎంకు ఫిర్యాదులు అందాయి. టీటీడీ కీలక అధికారి నిర్వాకం పైన సీఎం సీరియస్ అయ్యారు. తిరుమలలో వైసీపీ అధికారులకు ప్రాధాన్యత ఇప్పుడు కూటమి నేతలకు రుచించంటం లేదు.
బొత్సా లేఖతో
తిరుమలలో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో నిబంధనల ప్రకారం మంత్రి దర్శకా కోసం సిఫార్సు లేఖ ఇచ్చినా 12 మంది వరకు మాత్రమే అనుమతిస్తారు. కానీ, మాజీ మంత్రి బొత్సా ఇచ్చిన లేఖ పైన ఏకంగా 26 మందికి ఒకే రోజు దర్శనం కల్పించారు. ఈ అంశం పైన ఇప్పుడు కూటమి నేతలు సీఎంకు ఫిర్యాదు చేసారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ సమయంలో తిరుమల దర్శనాల్లో తమ కోట పెంచాలని ముఖ్యమంత్రిని కోరారు. వారంలో అయిదు రోజులు మాత్రమే అనుమతిస్తున్నారని వివరించారు.దీంతో ఎమ్మెల్యేల దర్శనం కోటాను పెంచాలని టీటీడీని సీఎం కోరారు.

సీఎంఓ నివేదిక
ఎమ్మెల్యేల అభ్యర్ధన పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇదే సమయంలో మాజీ మంత్రి..ప్రస్తుత శాసనమండలి విపక్ష నేత బొత్సాకు మాత్రం తిరుమలలో దక్కిన ప్రాధాన్యత చర్చకు వచ్చింది. బొత్స సత్యనారాయణ ఇచ్చిన సిఫారసు లేఖపై గత వారం ఏకంగా ఒకేరోజు 26 మందికి దర్శనాలకు అనుమతి ఇచ్చారు. దీని పైన సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి పూర్తి సమాచారం ఇచ్చారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిబంధనలు పక్కన పెట్టి పదుల సంఖ్యలో టికెట్లు ఎలా జారీ చేస్తారని మందించారు.
సన్నిహిత అధికారి
ఇలాంటి పరిణామాలు మరోసారి జరగడానికి వీల్లేదని ముఖ్యమత్రి టీటీడీ అధికారులకు సృష్టం చేశారు. ప్రస్తుతం టీటీడీలో కీలక స్థానంలో ఉన్న అధికారి వైసీపీ హయాంలో బొత్సా శాఖలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా పని చేసారు. తాజాగా ఆయనకు ఏరి కోరి చంద్రబాబు టీటీడీలో కీలక బాధ్యతలు అప్పగించారు. బొత్సాతో ఉన్న పరిచయంతో ఆయన లేఖకు ప్రాధాన్యత ఇస్తూ.. బొత్సా కోరిన విధంగా అందరికీ దర్శనాలు కేటాయించారు. టీటీడీతో పాటుగా పలు కీలక శాఖల్లో ఇప్పటికీ వైసీపీ ముఖ్యులకు సన్నిహితంగా ఉన్న అధికారులు ముఖ్య బాధ్యతల్లో ఉండటంతో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని కూటమి నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications