అన్నదాత సుఖీభవ వీరికే, ముహూర్తం ఫిక్స్ - మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ లో భాగంగా కొత్త ఆర్దిక సంవత్సరంలో రెండు ప్రధాన పథకాల అమలుకు సిద్దమైంది. ఇప్పటికే 2025 -26 వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయించారు. ఇక, అన్నదాత సుఖీభవ కింద రైతులకు మూడు విడతల్లో నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం అమలు విషయంలో ముఖ్యమంత్రి కీలక అంశాన్ని వెల్లడించారు. అయితే, పీఎం కిసాన్ తో కలిపి జయ చేయటం ద్వారా మార్గదర్శకాల ఖరారు పైన చర్చ సాగుతోంది.
పథకం అమలు ఇలా
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ రైతుకు రూ 20 వేలు చొప్పున ఆర్దిక సాయం అందించేందుకు సిద్దమైంది. ఈ మేరకు పథకం అమలు పైన తాజాగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పీఎం కిసాన్ కింద ప్రతీ ఏటా మూడు విడతలుగా విడుదల చేసే నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు అందిస్తామని స్పష్టం చేసారు. తొలి రెండు విడతల్లో రూ 5 వేలు, చివరి విడత రూ 4 వేలు చొప్పున ఇవ్వాలని... కేంద్రం మూడు దఫాలుగా ఇచ్చే ఆరు వేలతో కలిపి ఒక్కో రైతుకు రూ 20 వేలు అందుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మూడు విడతల్లో
ఇదే సమయంలో పీఎం కిసాన్ కింద 19వ విడత (2024 డిసెంబరు-మార్చి 2025) నిధుల విడుదలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.854.28 కోట్లు ఇచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. దీనివల్ల ఏపీలో 41,27,619 మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. కేంద్రం ఖరీఫ్, రబీ, మధ్యలో ఒకసారి మూడు విడతలుగా సాయం ఇస్తోంది. కొత్త ఆర్దిక సంవత్సరం నుంచి కేంద్రం ఎప్పుడు రైతు భరోసా నిధులు ఇస్తే...వాటితో కలిపి రాష్ట్ర ప్రభు త్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, పీఎం కిసాన్ అందుతున్న రైతుల సంఖ్య 41.27 లక్షలు ఉంది. ఏపీలో మాత్రం దాదాపుగా 55 లక్షల వరకు ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య పైన ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా కౌలు రైతులకు లబ్ది విషయంలోనూ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కౌలు రైతులకు దక్కేనా
అన్నదాతా సుఖీభవను కౌలు రైతులకూ వర్తింపజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చా రు. అయితే, కేంద్రం పీఎం కిసాన్ కింద కౌలు రైతులకు చెల్లింపులు చేయటం లేదు. కౌలు రైతుల కు లబ్ది కలిగేలా ఏపీ ప్రభుత్వం చట్ట సవరణకు సిద్దమైంది. సిసిఆర్‌సిలను అర్హతగా పెడితే లక్షల మంది కౌలు రైతులకు సహాయం దక్కదు. కొత్త చట్టం తెచ్చి ఉదారంగా గుర్తిస్తేనే వీలైనంత ఎక్కువ మందికి సాయం అందుతుంది. త్వరలో అన్నదాతా.. అమలు చేస్తామంటున్నారు. అదే జరిగితే కౌలు రైతులకు గతంలో జరిగిన విధంగానే నష్టం జరిగే అవకాశం ఉంది. పిఎంకిసాన్, బ్యాంక్ రుణాలు, అన్నింటికీ భూధార్ కీలకంగా మారింది. భూధార్ జారీ ప్రక్రియ రాష్ట్రంలో ముమ్ మరంగా జరుగుతోంది. అధికారికంగా భూమి యజమానికి భూధార్ ఇస్తే, కౌలు రైతుకు ఆ భూమిపై ఏ పథకమూ రాదు. ఏపీ సర్కారు తసుకొచ్చే చట్టం రూపకల్పనలో ఈ అంశాన్ని లీగల్‌గా పరిశీలి స్తున్నట్లు సమాచారం. దీంతో, అన్నదాత సుఖీభవ తుది మార్గదర్శకాల వేళ ఈ అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం











Click it and Unblock the Notifications