చంద్రబాబు కీలక ప్రకటన - గేమ్ ఛేంజర్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. గత అయిదేళ్లు కాల పాలన గురించి ప్రస్తావన చేసారు. ఆరు నెలల కూటమి పాలనలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రతీ సంక్షోభం అవకాశంగా మలచుకోవాలని సూచించారు. వాటిని గుర్తించి..సమర్ధంగా నిర్వహించటమే నాయ కత్వ లక్షణమని వెల్లడించారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ ఉదయం గుగూల్ తో ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవలను అందించే ఒప్పందం చేసుకున్నామని ..విశాఖ కేంద్రంగా ఆ సంస్థ పని చేస్తుందని ప్రకటించారు.

పరిస్థితుల్లో మార్పు
రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర అంశాలను ప్రస్తావిం చారు. ఈ రోజు ఏపీ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. గుగూల్ తో చేసుకున్న ఒప్పందం గురించి వివరించారు. మంత్రి లోకేష్ గుగూల్ తో ఈ ఒప్పందం వెనుక కీలకంగా వ్యవహరించారని చంద్రబాబు అభినందించారు. గత అయిదేళ్లు కాలంలో రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలతో అన్ని రంగాల్లోనూ నష్టపోయామని చెప్పుకొచ్చారు. ఆ సంక్షోభ సమయం నుంచి ఇప్పుడు అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకుంటున్నామని వివరించారు. కలెక్టర్ల సదస్సు ద్వారా ప్రజా సేవలను ఎలా మెరుగ్గా నిర్వహించాలనేది కీలకమని చంద్రబాబు స్పష్టం చేసారు.

CM Chandra Babu announces over AP Govt MOU with Google to work from Viskaha

గేమ్ ఛేంజర్ గా
ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు గుగూల్ సంస్థ విశాఖలో ఆ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తోందని చంద్రబాబు వెల్లడించారు. విశాఖకు గూగుల్ లాంటి సంస్థలు వస్తే అది గేమ్ చేంజర్ అవుతుందని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఏర్పాటైతే ఓ రాష్ట్రం ఒక దిక్సూచీగా మారుతుందని చెప్పారు. ఏపీని రానున్న రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీగా మార్చటం తో పాటుగా .. స్మార్ట్ వర్క్ చేసేలా కార్యాచరణలు రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు. తొలి కలెక్టర్ల సమావేశం కంటే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

కలెక్టర్లలో పోటీ తత్వం పెరగాలి
గతంలో ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు పెన్షన్లు సైతం ఒకటో తేదీనే ఇస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థి తుల్లోనూ చట్టప్రకారం శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆ విషయంలో కలెక్టర్లు జాగ్రత్తగా వ్యవ హరించాలని స్పష్టం చేశారు. పాలనలో వేగం పెరిగితేనే ప్రజలకు వేగంగా సేవలు అందుతాయని వివరించారు. దీని ద్వారా పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడినట్టే జిల్లాల మధ్య కలెక్టర్లు కూడా పోటీ పడాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియగా చంద్రబాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+