అమరావతిలో ఆ భూములు వెనక్కి- చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!!

అమరావతి కేంద్రంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆర్5 (R5) జోన్ భూములపై అధికారులకు కీలక దిశా నిర్దేశం చేసారు ఆ జోన్ కిందకు వచ్చే భూములను వెనక్కి తీసుకునేలా రెవిన్యూ శాఖకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. అక్కడ స్థలాలు కేటాయించిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వారి ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని రెండు జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీఆర్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన 50 వేల మందికి అమరావతిలో ఆర్ -5 జోన్ లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందు కోసం సీఆర్డీఏకు చెందిన 900 ఎకరాలను రెవిన్యూ శాఖకు బదిలీ చేసారు. అయితే, ఈ విధంగా స్థలాలు కేటాయించటం ద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్ కు విఘాతం ఏర్పడుతుందని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. దీంతో, వైసీపీ హయాంలో అక్కడ కేటాయించిన భూములను వెనక్కు తీసుకొని.. వారి ప్రాంతాల్లోనే ప్రభుత్వ విధానం మేరకు అర్హులకు ఇంటి స్థలాలు కేటాయించాలని చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం భూసమీకరణ, భూసేకరణ విధానాలలో ముందుకు వెళ్లాల్సిందిగా సూచించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలందకీ ఇళ్లు పథకంలో భాగంగా ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు 51 వేల మందిని ఎంపిక చేసింది. వారికి అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో లే అవుట్లు వేసి ఇళ్ల పట్టాలను కేటాయించింది.

cm-chandra-babu-big-decision-over-allocated-lands-in-r-5-zone-amaravati-key-directions-for-officia

సీఆర్డీఏ సమావేశంలో తాజా నిర్ణయాలు

కాగా, సీఆర్డీఏ తాజా సమీక్షలో చంద్రబాబు ఈ స్థలాల విషయంలో స్పష్టత ఇచ్చారు. 2023 కు ముందు ఉన్న విధంగానే ఆర్ -5 జోన్ కొనసాగించాలని నిర్ణయించారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ నుంచి రెవిన్యూ శాఖకు బదిలీ చేసిన భూములకు సంబంధించిన చెల్లించాల్సి నగదు చెల్లించలేదు. దీంతో, రెవిన్యూ శాఖకు తుది నోటీసులు జారీ చేసి.. ఆ భూములు సీఆర్డీఏ వెనక్కు తీసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక.. అమరావతిలో బీజేపీ కార్యాలయానికి గతంలో 2.8 ఎకరాల భూమి కేటాయించగా.. సాంకేతిక ఇబ్బందుల కారణంగా దానిని 1.43 ఎకరాలకు తగ్గించి.. వేరే చోట కేటాయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. కొత్తగా ఏడు సంస్థలకు భూములు కేటాయిస్తూ.. గతంలో కొన్ని సంస్థలకు చేసిన కేటాయింపుల్లో మార్పులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపారు. శాసనసభ, హైకోర్టు భవనాల ఎంఈపీ పనులకు టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+