కొత్త ఇళ్లు, స్థలాల పై ప్రభుత్వం కీలక నిర్ణయం- అర్హుల జాబితా.. పంపిణీ ముహూర్తం..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇళ్ల పథకం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. అందులో భాగంగా మరో సారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహణ దిశగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. టిడ్కో ఇళ్లు కాకుండానే మరో 5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం స్పష్టం చేశారు.
పేదలకు ఇళ్ల పథకం నిర్వహణ పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయా లని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఆ దిశగా గృహనిర్మాణ శాఖ వేగంగా పని చేయాలని.. టిడ్కో ఇళ్లు కాకుండా మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేసారు. ఎక్కడా ఆలస్యం కాకూడదని చెప్పిన చంద్రబాబు... లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తం అవుతోందని చెప్పుకొచ్చారు. ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని చెప్పారు. సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్టు సర్వేలో తేలిందని. వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

చంద్రబాబు దిశా నిర్దేశం
కాగా, రీచ్‌ల వద్ద, స్టాక్ యార్డుల వద్ద రవాణా పేరుతో కానీ, ఇతర పేర్లతో ఎక్కువ చార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని... దీనిపై పటిష్ఠ నిఘా పెట్టాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. కళాశాల విద్యను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దాలని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కళాశాల విద్యను రీఓరియెంటేషన్ చేయాల్సి ఉందని, ఆ మేరకు అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. 'సంప్రదాయ కోర్సులతో పాటు డిమాండ్ ఉన్న కోర్సులను కొత్త కరిక్యులంను ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలి. ఈ మేరకు కరిక్యులంను రీస్ట్రక్చర్ చేసేలా చూడాలి. వర్సిటీల ర్యాంకింగ్‌లు పెరగాల్సి ఉంది. మధ్యాహ్న భోజన పథకంపై ఫిర్యాదులు రాకూడదు. శాప్ విభాగం 5కే రన్ వంటి కార్యక్రమాలు చేపట్టాలి' అని సీఎం సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కఠిన నిబంధనలు అమలు చేయడానికంటే ముందు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని సూచించారు. హెల్మెట్ వల్ల ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని నిర్దేశించారు విద్యుత్, కేబుల్ తీగలు కిందకు వేలాడుతున్న కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇలాంటివి ఇకపై జరగడానికి వీల్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications