రైతులకు చంద్రబాబు బంపరాఫర్ - ప్రతి బస్తాకు రూ.800, నేరుగా ఖాతాల్లోకి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా పలు అంశాల పైన చంద్రబాబు స్పందించారు. అధికారులు మానవీయ కోణంలో పని చేయాలని నిర్దేశించారు. ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయకపోతే ఫలితాలు రావని పేర్కొన్నారు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనని ఆదేశించారు. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో రైతులు యూరియా వినియోగం గురించి ప్రస్తావన చేస్తూ కీలక ప్రకటన చేసారు.
రైతుల కోసం సీఎం చంద్రబాబు ఆసక్తి కర అంశం వెల్లడించారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి బస్తాకు రూ. 800 నేరుగా రైతుకు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతు తన పంటకు ఈ ఏడాది నాలుగు బస్తాల యూరియా మాత్రమే వినియోగించి, వచ్చే ఏడాది రెండు బస్తాలు మాత్రమే వాడితే ప్రతి బస్తాకు రూ.800 చొప్పున రూ.1600 వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూరియా వాడకం తగ్గించడంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రైతులు వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గిస్తే ఆ మేరకు ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించారు.

మన రైతులు ఎక్కువ ఎరువులు వాడుతున్నారని చెప్పుకొచ్చారు. దీని వల్ల మిరపను చైనా నుంచి తిప్పి పంపారని.. ఇలాంటి పరిస్థితి అక్వాలో కూడా జరిగిందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. విజన్ రూపొందించి దానికి నిధులు కేటాయించకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పామని.. అదే విధంగా సూపర్ సిక్స్‌ను సక్సెస్ చేశామని ఉద్ఘాటించారు.
దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకంలో భాగంగా 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి ఆర్థికసాయం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు. ఉచిత బస్సు అమలు చేయలేమని కొందరు విమర్శించారు... కానీ స్త్రీశక్తి పథకం సఫలమైందని వివరించారు. 50 శాతం మహిళలను వంటింటికే పరిమితం చేస్తే వారి శక్తియుక్తులు వృథా అవుతున్నాయని చంద్రబాబు విశ్లేషించారు.












Click it and Unblock the Notifications