చంద్రబాబు సీరియస్- టీటీడీ ముఖ్య అధికారి అవుట్..!?
తిరుపతి ఘటన పైన సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఘటన పైన ఉన్నత స్థాయి సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. బాధ్యులు ఎవరనేది వెంటనే ఫిక్స్ చేయాలని ఆదేశించారు. సమన్వయం కొరవడటం కారణంగానే ఘటన చోటు చేసుకున్నట్లు నివేదించిన అధికారులు రెండు కేసులు నమోదు చేసామని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారుల పై వేటు వేయాలని చంద్రబాబు ఆదేశించారు,
సమన్వయ లోపం
తిరుపతికి చేరుకున్న చంద్రబాబు ఘటనా స్థలిని పరిశీంచనున్నారు. ఆ తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. ఇప్పటికే ఈ ఘటన పైన చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాధమికంగా ఘటనకు సంబంధించిన సమాచారం అధికారులు సీఎం కు నివేదించారు. బైరాగి పట్వాడా వద్ద లోపల ఉన్న ఒక మహిళకు గాలి ఆడక స్పృహ తప్పి పడి పోయిందని, ఆమెను కాపాడేందుకు అక్కడి డీఎస్పీ గేట్ తీశారని పోలీసులు నివేదికలో తెలిపారు. టిక్కెట్లు కోసం గేట్ తీశారని భావించి ఒక్కసారిగా భక్తులు బయటకు వచ్చారని చెప్పారు. గేటు తీయడంతోనే తొక్కిసలాట ప్రారంభమైందని ముఖ్యమంత్రికి వివరించారు.

కఠిన చర్యలు
కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగే ప్రమాదముందని చెప్పినప్పటికీ అధికారుల నుంచి అందుకు అనుగుణంగా ఎందుకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. అసలు టీటీడీ ఈఓకు సమాచారం ఎప్పుడు వచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. భక్తుల ఏర్పాట్లపై మీ ప్లానింగ్ ఏమిటని నిలదీసారు. భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని నివేదికలో తెలిపారు. బాధ్యలను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మొత్తం ఈ ఘటనలో అధికారు ల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.
కీలక అధికారిపై వేటు
బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా వస్తారని తెలిసీ ముందుగానే ఎందుకు చర్యలు తీసుకో లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సాయంత్రం లోపు కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఇక, డిప్యూటీ సీఎం పవన్.. మాజీ సీఎం జగన్.. లోకేష్ సైతం తిరుపతి కి వస్తున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కాగా, టీటీడీ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో. ఈ సాయంత్రం లోగా టీటీడీ ముఖ్య అధికారి పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications