ఇక సహించను - ఆ నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. అదే సమయంలో కొందరు నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంఛార్జ్ మంత్రులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. తొమ్మిది నెల ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతీ మంత్రి ప్రభుత్వం - పార్టీ మధ్య సమన్వయం తో వ్యవహరించాలని నిర్దేశించారు. జిల్లాల పర్యటనలో పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని స్పష్టం చేసారు. వైసీపీతో సంబంధాలు కొనసాగించే నేతలను ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

అవకాశం ఇవ్వద్దు
టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని వివరించారు. జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని సీఎం నిర్దేశించారు. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లా కో-ఆర్డినేటర్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందించాలని స్పష్టం చేసారు. గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్దేశించారు.

చంద్రబాబు క్లారిటీ
జిల్లా ఇంఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో ఫోకస్ పెట్టాలని చంద్రబాబు సూచించారు. పర్యటనల సంఖ్య పెరగాలన్నారు. కార్యకర్తలు, నాయకులతో మమేకమవ్వడంతోపాటు జిల్లా పార్టీ కార్యాల యానికి తప్పకుండా వెళ్లాలని కోరారు. ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూ డదని చంద్రబాబు తేల్చి చెప్పారు. తాను ఈ విషయాన్ని చెప్తే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వొద్దని చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని స్పష్టం చేసారు. పార్టీ లకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు.

cm-chandra-babu-directed-incharge-ministers-to-co-ordinate-govt-and-party-in-the-districts

ప్రభావం చూపించాలి
సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ పరమైన సంబంధాలు వేరని పేర్కొన్నారు. వైసీపీ వారిని దరిచే రనివ్వొద్దని చంద్రబాబు సూచించారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని చెప్పా రు. పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను నామినేటెడ్ పదవుల కోసం అందించాలని సీఎం సూచించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్‌లను నియమిస్తామని వెల్లడించారు. నామినేటెడ్ పదువుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. పదవులు తీసుకున్నట్లు కాదు...ఎన్నికల్లో ప్రభావం చూపించాలని చంద్రబాబు పేర్కొన్నారు.

పదవుల పై క్లారిటీ
మొదటి సారే పదవులు రాలేదని అనుకోవద్దని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలినవారికి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడూ అంతే హుందాగా వ్యవహరించాలని హితబోధ చేసారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన మనం అందించాలన్నారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడం మన విధానామని చంద్రబాబు స్పష్టం చేసారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలని సూచించారు.

సమన్వయం ఉండాలి
రెండు కిలో వాట్‌ల రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనంగా అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. కేంద్రం ఇచ్చే రాయితీతో కలిపి బీసీలకు రూ.80 వేల మేర రాయితీ వస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పా టు చేస్తామని వివరించారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల రూఫ్‌ టాప్‌ల ఏర్పాటే లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంట్‌లో మీ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకుని ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+