చంద్రబాబు మిషన్, డెడ్ లైన్ - కొత్త రూపు..!!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ ఓటమికి ప్రజల్లో ఆగ్రహామే కారణమని కూటమి నేతలు గుర్తించారు. ఆ కారణాల్లో ఒకటిగా ఉన్న రోడ్ల మరమ్మతుల పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ చేసారు. నాడు రోడ్ల పైన గుంతలు కూడా పూర్తిగా రిపేర్లు చేయకపోవటం తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో, ముఖ్యమంత్రి వీటి కోసం రూ 861 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో, ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్ల రూపు రేఖల్లో మార్పు కనిపిస్తోంది. ఈ మిషన్ పూర్తి చేయటానికి సంక్రాంతి డెడ్ లైన్ గా ఫిక్స్ చేసారు.

చంద్రబాబు మిషన్
వైసీపీ హయాంలో రోడ్ల దుస్థితి గురించి పట్టించుకోలేదు. ఫలితంగా సాధారణ ప్రజల్లోనూ నాటి ప్రభుత్వం పై ఆగ్రహం పెరిగింది. అన్నీ రకాల అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపించి.. వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసాయి. అందులో ప్రధానమైనది రోడ్ల అంశం. చంద్రబాబు రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి పై ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. రోడ్లను మరమ్మత్తులు ఏ మేర చేయాల్సి ఉందీ .. ఎంత ఖర్చు అవుతుందనేది వివరాలు సేకరించారు. రాష్ట్రంలో దాదాపు 54,000 కి.మీ రోడ్ల నెట్‌వర్క్ ఉందని, అందులో 20,000 కి.మీ నుండి 30,000 కి పైగా రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందు కోసం వెంటనే అంగీకరించిన చంద్రబాబు రూ 861 కోట్లను విడుదల చేసారు.

CM Chandra Babu directed officials that the state will be made pothole-free by the upcoming Sankranti

చంద్రబాబు డెడ్ లైన్
ఇదే సమయంలో అధికారులకు గుంతలు లేని రోడ్లుగా మార్చే కార్యక్రమం ఒక మిషన్ గా కొనసాగా లని నిర్దేశించారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికా రులను ఆదేశించారు. వైసీపీ హయాంలో ఐదేళ్లు గుంతలు తవ్వారు, గోతులు పెట్టారుని విమర్శిం చారు. రోడ్లను ప్రమాదకరంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రోడ్లు అనేది నాగరికతకు చిహ్నం గా పేర్కొన్నారు. రౌడీ రాజకీయాలు వద్దని.. అభివృద్ధి రాజకీయాలు కావాలని స్పష్టం చేసారు. రెండు దశల్లో చేపట్టిన ఈ మిషన్ సంక్రాంతి నాటికి పూర్తి చేసేలా ఆర్ అండ్ బీ అధికా రులు జిల్లాల వారీగా సమన్వయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.

మొదలైన మార్పు
రోడ్ల మరమ్మతుల పనులు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల పనులు కూడా మొదలుపెట్టి కన్వర్షన్ కింద తీసుకు వచ్చారు. గతంలో స్టేట్ హైవే, నాబార్డ్, ఎన్డీబీ క్రింద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని కూటమి ప్రభుత్వం గుర్తిం చింది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లును చెల్లించకపోవడంతో వారు పనులు చేయలేదని అధికారులు నివేదిక సమర్పించారు. ఇప్పుడు ఎన్డీబీకి రూ.240 కోట్లు చెల్లించగా, రూ.5 వేల కోట్ల పనులు మొదలు పెట్టారు. రాష్ట్రంలో సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు కనిపించాలని నిర్దేశించిన ముఖ్యమంత్రి ప్రతీ మూడు రోజులకు ఒక సారి ఈ అంశం పైన అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఫలితంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రోడ్లలో ఇప్పటికే మార్పు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+