నామినేటెడ్ పదవుల జాబితా సిద్దం - లిస్టులో ఉన్నదెవరు..!!

ఎన్డీఏ పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర కానుక ఇవ్వనున్నారు. మూడు పార్టీ ల నుంచి నామినేటెడ్ పదవుల కోసం నిరీక్షిస్తున్న వారికి గుడ్ న్యూస్ సిద్దమైంది. ఇప్పటికే ఖరారు చేయాల్సిన పదవులు.. వ్యక్తుల గురించి బీజేపీ, జనసేన నుంచి చంద్రబాబుకు జాబితాలు అందాయి. చంద్రబాబు - పవన్ మధ్య చర్చలు జరిగాయి. దీంతో, పెద్ద మొత్తంలో నామినేటెడ్ పదవులను ప్రకటించేందుకు తుది కసరత్తు జరుగుతోంది.

చంద్రబాబు కసరత్తు
కొత్త సంవత్సరం వేళ చంద్రబాబు కూటమి పార్టీ నేతలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమ య్యారు. ఈ సారి జాబితా పెద్ద సంఖ్యలో ఉంటుందని తెలుస్తోంది. గ‌త రెండు జాబితాల్లో జ‌న‌సేన‌, బీజేపీల‌ కంటే..టీడీపీ నేత‌ల‌కే ఎక్కువగా ప‌ద‌వులు ద‌క్కాయి. కానీ, టీడీపీ నుంచి పదవులు ఆశిస్తు న్న వారి సంఖ్య భారీగా ఉంది. ఈ సారి జాబితాలో తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నా రు. ఎమ్మెల్సీ పదవులు కోసం పోటీ ఎక్కువగా ఉంది. దీంతో, ఎవరికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి.. ఎవరిని నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయాలనేది క నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

CM Chandra Babu exercise on nominated posts chances to announce on Jan 1st

వారికే పదవులు
టీడీపీ నుంచి ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్దుల కోసం సీట్లు త్యాగం చేసిన వారికి ఈ లిస్టు లో ప్రాధాన్యత దక్కనుంది. పిఠాపురం వర్మ, దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, మేకపాటి చంద్రశేఖర రెడ్డి లాంటి వారు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న 60 కార్పోరేషన్ల పదవుల కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. అందులో బేవరేజెస్ కార్పొరేషన్, ఆప్కాబ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదువులు ఉన్నాయి. వీటితో పాటుగా అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్, నెడ్ క్యాప్, ప్రణాళిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా కుల సంఘాల పదవులు ఖరారు కావాల్సి ఉంది.

మూడు పార్టీల నుంచి
ఈ సారి జాబితాలో మూడు పార్టీల నుంచి పదవులు ఆశిస్తున్న వారి పేర్లలో కొందరికి పదవులు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీ ఆశావాహుల్లో గన్ని ఆంజనేయులు, బూరుగుపల్లి శేషా రావు, మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవీ సుబ్బారెడ్డి, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, మాజీ ఎమ్మె ల్యే రామానాయుడు పేర్లు ఉన్నాయి. జనసేననుంచి అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామ కృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సీట్లు త్యాగం చేసిన నేతలు ఎమ్మెల్సీ స్థానాల పైన ఆశలు పెట్టుకుంటున్నారు. దీంతో, చంద్రబాబు ప్రకటించే జాబితా పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+