175 నియోజకవర్గాల్లో కొత్తగా, మోదీ సూచన మేరకు - చంద్రబాబు ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు.పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతోందని.. దీని పర్యావసానంగా ఇతర ప్రాంతాల్లో కూడా గ్రీన్ కవర్ పెరుగుతోందన్నారు. గత ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ లో వెళ్తే కింద చెట్లు నరికేసే వారని ఎద్దేవా చేసారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి 175 నియోజకవర్గాలకు టార్గెట్ ఫిక్స్ చేస్తూ కొత్త ప్రాజెక్టు ప్రకటించారు.

చెట్లు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడిదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అమ రావతి పరిధి అనంతవరం ఏడీసీఎల్ పార్కులోడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాయణ తో కలిసి సీఎం మొక్కలు నాటారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కి తీసుకుంటున్న చర్యలను కాలుష్య నియం త్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య సీఎంకు వివరించారు. రాజధాని అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు అధికారులను ఆదేశించారు. మియావకీ గార్డెన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, అమెరికాలో మియావకీ విధానాలపై దృష్టి సారించాలని సూచించారు.
ఈరోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్ష ణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమం త్రి వస్తుంటే ఎక్కడైనా ఒక్క చెట్టు తాము నరుకుతున్నామా అని ప్రశ్నించారు. కొన్ని దేశాల్లో చెట్లు నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారన్నారు. చెట్లు నరికితే మనిషిని చంపినట్టే అని కొన్ని దేశాల్లో చట్టాలు కూడా ఉన్నాయన్నారు. నాలుగు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37 శాతం గ్రీన్ కవర్ రావాల్సి ఉందన్నారు. రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై అన్న నక్షత్రం పేరుకు తగ్గ ట్టుగా విత్తనాలు ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా ప్లాస్టిక్‌ను నిషేధిస్తామన్నారు. 175 నియోజక వర్గాల్లో నగర వనాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.












Click it and Unblock the Notifications