తల్లికి వందనం రూ 15 వేల మొత్తం పెంపు, అప్పుడే - సీఎం చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. తల్లికి వందనం పెంపు పైన సంకేతాలు ఇచ్చారు. కప్పుడు కుటుంబ నియంత్రణ కోసం చెప్పామని గుర్తు చేసారు. పిల్లలే సంపద అని ఇవాళ చెబుతున్నానన్నారు. మూడో బిడ్డ ఉంటే, పుట్టిన వెంటనే రూ.30 వేలు ఇస్తామని సీఎం వెల్లడించారు. ఇదే సమయంలో స్వచ్చాంధ్ర గురించి వివరించారు. అన్ని ప్రాంతాల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి...ప్రతిపక్షం పైన విమర్శలు చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు నుంచే 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులపాటు 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' ఉంటుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన "స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర" కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కీలక అంశాలను ప్రస్తావించారు. పిల్లలే సంపద అని ఇవాళ చెబుతున్నానని వివరించారు. మూడో బిడ్డ ఉంటే, పుట్టిన వెంటనే రూ.30 వేలు ఇస్తామని ప్రకటించారు. నాలుగో బిడ్డ పుడితే, పుట్టిన వెంటనే రూ.40 వేలు ఇస్తామని వెల్లడించారు. పిల్లలు భారమనుకోకూడదు, వాళ్లే సంపద అని గుర్తించాలని సూచించారు. తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తున్నామని... భగవంతుడు కరుణిస్తే తల్లికి వందనం మొత్తాన్ని పెంచుతామని చంద్రబాబు వెల్లడించారు.

చంద్రబాబు కీలక సూచనలు
స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలని చంద్రబాబు సూచించారు.సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారమవుతుందని చెప్పారు. తలసరి ఆదాయం పెంచాలనేది తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను మనం నిషేధించాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్క ఆఫీస్‌పై సోలార్ ప్లేట్స్ పెట్టుకోవాలని... పేదలకు సేవ చేయాలనే ఆశయం ఉన్నవారిని ప్రోత్సహించాలని సూచించారు. వ్యర్థాల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామని.. రాష్ట్రంలో 31.33శాతం అటవీ సంపద ఉందని చెప్పారు. ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టామన్నారు. భూతగాదాలు లేకుండా చేసే బాధ్యత, కూటమి ప్రభుత్వానిదని చంద్రబాబు స్పష్టం చేశారు. 23 నెలల్లో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ఒప్పందాలతో మన పిల్లలకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు.













Click it and Unblock the Notifications