వంగవీటి రాధా కు చంద్రబాబు కీలక బాధ్యతలు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి లో పదవుల పంపకాల పైన చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల సమయంలో కూటమిలోని మూడు పార్టీల్లో పలువురికి పదవులపైన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామ ని చెప్పారు. చాలా మందికి ఇంకా అవకాశం దక్కదలేదు. 2019 నుంచి వంగవీటి రాధాకు హామీ అమలు కాలేదు. ఈ సమయంలో రాధా కీలక నిర్ణయానికి సిద్దమయ్యారు. దీంతో, చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. సీఎంతో సమావేశం సమయంలో కీలక హామీ దక్కింది.
చంద్రబాబుతో చర్చలు
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పని చేసారు. తరువాత ప్రజా రాజ్యం.. ఆ తరువాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో రాధా విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు. అందుకు నిరాకరించిన జగన్ మచిలీపట్నం ఎంపీ సీటు ఇచ్చేందుకు సిద్దం అ య్యారు. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, వంగవీటి రాధా పార్టీ వీడారు. టీడీపీలో చేరారు. ఆ సమయంలోనే వంగవీటికి ఎమ్మెల్సీ పదవి పైన హామీ దక్కింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో.. ఎమ్మెల్సీగా అవకాశం దక్కలేదు. దీంతో, రాధా మౌనంగా ఉండిపోయారు.

రాధాకు పిలుపు
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ తిరిగి వంగవీటి రాధా ను వైసీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసారు. కానీ, సఫలం కాలేదు. 2024 ఎన్నికల సమయంలో రాధా జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. పవన్, మనోహర్ తోనూ రాధా ప్రత్యే కంగా సమావేశం అయ్యారు. కూటమి ఖరారు కాగానే.. టీడీపీకి మద్దతుగా రాధా ప్రచారం చేసారు. 2024 లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి విడతలోనే రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించారు. ఇప్పటి వరకు పదవి దక్కలేదు. ఈ సమయంలోనే రాజకీయాల నుంచి రాధా తప్పుకుంటున్నారనే ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్స్ లో జరిగింది. దీంతో, టీడీపీ నాయకత్వం అలర్ట్ అయింది.
పదవి పై హామీ
తాజా పరిణామాల వేళ సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. రాధాకు పదవి ఇవ్వక పోవటం పైన అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ పిలుపు రావటంతోనే రాధా తాజాగా చంద్రబాబుతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీల ఖరారులో ఒకే వర్గానికి చెందిన వారికి బీజేపీ, జనసేన నుంచి అవకాశం ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో, ఈ విడత పదవుల్లో ఖచ్చితంగా రాధాకు అవకాశం ఇస్తామనే హమీ దక్కినట్లు పార్టీ వర్గాల సమాచారం. సమావేశం తరువాత త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని తన మద్దతు దారులతో రాధా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా..లేక, నామినేటెడ్ పదవి కట్టబెడతారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications