అమరావతి భూముల ధరలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

అమరావతిలో ప్రధాని పర్యటనకు సర్వం సిద్దమైంది. అమరావతి పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని వస్తున్న వేళ భారీ ఏర్పాట్లు చేసారు. ప్రభుత్వం ఈ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందు కోసం దాదాపు అయిదు లక్షల మందితో సభ ఏర్పాటు చేసింది. పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇదే సమయంలో అమరావతి భవిష్యత్ తో పాటుగా లక్ష్యాలు.. భూము ల ధరల పైన చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ప్రతీ ఒక్కరూ అమరావతి గురించి గర్వం గా చెప్పుకునేలా తీర్చి దిద్దుతామని చంద్రబాబు వెల్లడించారు.

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కును ప్రారంభించారు. వర్చువల్‌గా 11 ఎంఎస్‌ఎంఈ పార్కులను సీఎం మొదలుపెట్టారు. 14 ఎఫ్‌ఎఫ్‌సీలు, 25 ఎంఎస్‌ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఏపీలో అసంఘటిత కార్మికులు అధికంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వారందర్నీ ఆదుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితం చేశామని... భవన నిర్మాణ కార్మికుల పనుల కోసం భవన అనుమతులు తేలికగా పొందే వీలు కల్పించామన్నారు. నారంపేట ఎంఎస్‌ఎంఈ పార్కులో నేరుగా పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. షెడ్లు, కరెంటు అందుబాటులో ఉంటాయని. కామన్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.

cm-chandra-babu-key-comments-on-amaravati-land-rates

అమరావతిలో ఇక
34వేల ఎకరాల్లో అమరావతిని నిర్మించి అక్కడి వారిని కోటీశ్వరులని చేయాలనుకున్నామన్నారు. 29 వేల మంది రైతులు భూములిచ్చారని.. ఎక్కడా రైతుకి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ అమరావతి తమ రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా నిర్మాణాలు జరుగుతాయని వెల్లడించారు. అమారవతిలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇస్తామని ..భూముల ధరలు పెరుగుతున్నాయని చంద్రబాబు వివరించారు. అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇక, ఏపీలో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. నారంపేట పార్కు వల్ల ఎన్నో కుటుంబా లు ఆర్ధికంగా ఎదుగుతాయన్నారు. 50 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఇక్కడి నుంచే ప్రారంభించా మని.. మండలానికో ఎంఎస్‌ఎంఈ పార్కు తీసుకురావాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Take a Poll

భవిష్యత్ ఏఐదే
ఏపీకి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉందని... భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని చెప్పుకొచ్చారు. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతరం కేంద్రంగా అయిదు రీజనల్ హబ్‌లు పెడుతున్నామన్నారు. పరిశ్రమలను విద్యాసంస్థలను అనుసంధానం చేయబోతున్నామన్నారు. యువత అందరికీ మంచి ఆలోచనలు ఉన్నాయన్నారు. ఉద్యోగం పొందడం కాదని, ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉండాలని సూచించారు. ఐటీ వల్ల ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన తెలుగు బిడ్డలు ఉన్నారని... ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+