కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు భాగస్వామ్య పక్షాల నేతలకు కీలక పిలుపునిచ్చారు. ఎన్డీయే మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిపే "అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన" యాత్రలో పాల్గొనాలని నేతలకు స్పష్టం చేసారు. వాజ్ పేయ్ తో తనకున్న వ్యక్తి గత అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మోదీ పాలనా పరమైన నిర్ణయాలను చంద్రబాబు ప్రశంసించారు.
వాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్... మోదీ సుపరిపాలన యాత్ర తల పెట్టిన బీజేపీ కార్యవర్గానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 25వ వరకు చేపట్టే ఈ యాత్రలో 3 పార్టీల నేతలు పాల్గొనాలని సూచించారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోష కరమన్నారు. దేశంలో సుపరిపాలనకు వాజ్‌పేయ్ నాంది పలికారు.

ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయని వివరించారు. వాజ్ పేయి అజాత శత్రువు, ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్ పేయి కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారని గుర్తు చేసారు. 9 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోందని పేర్కొన్నారు.
18 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని చంద్రబాబు చెప్పారు. 1998లో పోఖ్రాన్-2 అణు పరీక్షలు జరిపి భారతదేశ శక్తి చాటారు...కార్గిల్ యుద్దంతో శత్రువుకు తిరుగులేని సమాధానం ఇచ్చారని ప్రశంసించారు. వాజ్ పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశ దశ దిశ మార్చిందని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా కూడా ఆయనతో అనుబంధం ఉందని.. రాష్ట్రాభివృద్దిలో ఆయన నాడు ఎంతో సహాయం చేశారని చెప్పారు. రాష్ట్రం కోసం ఏది అడిగినా కాదనేవారు కాదని గుర్తు చేసుకున్నారు.
టెలీ కమ్యునికేషన్ రంగం, విమానయాన రంగంలో సంస్కరణలకు నాంది పలికారు. నాడు అణు పరీక్షలు అయినా, నేడు సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా నేడు సాగరమాల అయినా అవి ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలుగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశాన్ని 2047కు నెంబర్ వన్ చేసేందుకు పని చేస్తున్నారని చెప్పారు. "అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన" కార్యక్రమాన్ని విజయంతం చేయాలని స్పష్టం చేసారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications