ప్రధాని రాక వేళ మారుతున్న చంద్రబాబు లెక్కలు- కీలక నిర్ణయం..!!

రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అమరావతి పనుల ప్రారంభం కోసం ప్రధాని మోదీ మే 2న రానున్నారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రోడ్ షో ఏర్పాటు చేసారు. రైతులు ప్రధానికి అరుదైన స్వాగతం పలికేందుకు సిద్దం అవు తున్నారు. ప్రధాని సభలో అమరావతి రైతులకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు. బహిరంగ సభలోనూ ప్రధాని ప్రసంగించనున్నారు. కాగా, ప్రధాని పర్యటన వేళ రాజధాని లో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు.

ప్రధాని రాక వేళ
ప్రధాని మోదీ మే 2న అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తాజాగా ఢిల్లీలో ప్రధానితో సీఎం చంద్రబాబు కలిసిన సమయంలో అమరావతి ప్రణాళికలను వివరించారు. ఆ సమయంలోనే పీఎం మోదీ అమరావతిలో జపాన్‌ 'మియావాకి' విధానం అమలు చేయాలని సూచించారు. ఇక, ఇటు అమరావతి విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడున్న 54 వేల ఎకరాలకు తోడు అద నంగా 44,676 ఎకరాలు సమీకరించనున్నారు. దీనికోసం మూడు మండలాల పరిధిలో 11 గ్రామాలను గుర్తించారు. కొత్తగా సేకరించే గ్రామాలతో కలిపి రాజధాని ప్రాంతం మొత్తం లక్ష ఎక రాలకు చేరుకుంటుంది. వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. గుంటూ రు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు సమీకరణకు నోటిఫికేషన్‌ ఇవ్వగానే సిఆర్‌డిఎ సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది.

cm-chandra-babu-latest-plan-on-amaravati-ahead-pm-modi-tour

ప్రధానితో భేటీ
అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో 2015లో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో ప్రస్తుత రాజధానిగా నిర్ణయించిన ప్రాంతంలో సమీకరించిన భూముల్లో రైతులకు ఇప్పటి వరకూ ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు. కొత్తగా మరోసారి పూలింగు అంటే రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇన్నర్‌ రింగురోడ్డుకు ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాలతోపాటు, ఎర్రుపాలెం, నంబూరు రైల్వేలైన్‌కు అవసరమైన భూములను కలిపి సమీకరణ చేయనున్నారు. ఇటీవల మంత్రి నారాయణ రాజధాని చుట్టుపక్కల స్మార్ట్‌ ఇండ్రస్టీస్‌ ఏర్పాటుకు భూ సమీకరణ చేస్తామని, ప్రజలు అంగీకరించకపోతే సేకరణకు వెళతామనీ ప్రకటించారు. ఆయన అన్నదే తడవుగా పూలింగు పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కూటమి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేశారు. అభ్యంతరాలున్నా రైతులందరూ అంగీకరించినట్లు ప్రకటించారు. కొత్తగా పూలింగు చేపట్టబోయే గ్రామాల్లో తుళ్లూరు మండల పరిధిలోని హరిశ్చంద్రాపురం, వడ్డమాను రెవెన్యూ గ్రామాలను పూర్తిగా చేర్చారు.

Take a Poll

11 గ్రామాల పరిధిలో
హరిశ్చంద్రాపురంలో 2,429 ఎకరాలు, వడ్డమానులో 1,937 ఎకరాలను సమీకరించనున్నారు. పెద రిమిలో 6,513 ఎకరాలు తీసుకోనున్నారు. అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురంలో 3,360 ఎకరాలు, ఎండ్రాయిలో 2,167, కర్లపూడిలో 2,947, మోతడకలో 2,345, నిడుముక్కలలో 2,013 ఎకరాలు సమీకరణ కింద తీసుకోనున్నారు. తాడికొండ మండల పరిధిలో తాడికొండలో 12,797 ఎకరాలు సమీకరణ పద్ధతిలో తీసుకోనున్నారు. కంతేరులో 3,671, మంగళగిరి మండలం కాజలో 4,492 ఎకరాలు మొత్తం 44,676 ఎకరాలు సమీకరణ కింద తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్‌ ఇచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించేందుకు వీలుగా సిఆర్‌డిఎ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను రైతులతో సమావేశాలు నిర్వహించి ముందుగా వారిని సిద్ధం చేయాలని సూచించింది. ఈసారి పూలింగులో కొత్త జాతీయ రహదారి వరకూ చేపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+