పేదలకు ఇళ్ల కేటాయింపు పై చంద్రబాబు కీలక ప్రకటన - ఇక నుంచి ఇలా..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. పేదలకు ఇళ్ల కేటాయింపు పైన స్పష్టత ఇచ్చారు. తమది పేదల ప్రభుత్వమని.. వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని చెప్పుకొచ్చారు. ఇళ్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలను కలిపేందుకు పక్క పక్కనే రెండు ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటిపై సోలార్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇళ్లపై, పొలాల్లో కరెంట్ తయారు చేయిస్తున్నామని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్ల కేటాయింపు పైన ప్రభుత్వ లక్ష్యాలను వెల్లడించారు. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మూడు లక్షల గృహాలను వర్చువల్‌గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 2029 నాటికి రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేసారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు అప్పగి స్తున్నామని మళ్లీ ఉగాది నాటికి మిగతావి పూర్తి చేసి అప్పగిస్తామని వెల్లడించారు.

ఇది పేదల ప్రభుత్వం వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని వ్యాఖ్యానిచారు. ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్ తంగా 5.9 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తామని అలానే ఇళ్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తున్నామని సీఎం అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
ఒక్కరోజే రాష్ట్రంలో మూడులక్షల ఇళ్లకు గృహా ప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదలకి సొంతిల్లు ఉండాలనేది తన లక్ష్యమని నొక్కిచెప్పారు. ఇళ్లు అంటే నాలుగు గోడలు కాదని.. భవిష్యత్‌కు భద్రత అని అభివర్ణించారు. వచ్చే ఏడాది నాటికి 5.90 లక్షల గృహాప్రవేశాలు చేయిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. వర్క్‌ఫ్రం హోమ్ కింద ఇక్కడి నుంచే పని చేసుకోవచ్చని ఎక్కడి వాళ్లకు అక్కడే ఉద్యోగాలు కల్పిస్తాని వివరించారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తిచేసే బాధ్యత మాదని అలానే చెరువులన్నీ నింపి భూగర్భ జలాలు పెంచడమే తమ లక్ష్యమని హామీ ఇచ్చారు. నదుల అనుసంధానం నా జీవితాశయమని దీని వల్ల రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications