శ్రీవారి దర్శనం, వసతి, సేవలు ఇక నుంచి.. టీటీడీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు..!!

Tirumala: తిరుమలలో శ్రీవారి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. టీటీడీ పైన చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలో ఆధ్యాత్మికత పెంపొందిస్తూ.. విద్య - వైద్య సేవలకు చిరునామా నిలిచేలా కార్యాచరణ ఉండాలని నిర్దేశించారు. అదే విధంగా తిరుపతిలో శ్రీవారి వైద్య సేవకుల నియామకం పైన నిర్ణయించారు. ఇక.. దర్శనం - వసతి పైన టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయాల ను అమలు చేయనుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీకి పలు సూచనలు చేసారు. తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రులను అనుసంధానం చేసి, వాటిని ఒక మోడల్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఆస్పత్రుల తరహాలో అత్యుత్తమ నిర్వహణ ప్రమాణాలతో వీటిని తీర్చిదిద్దాలని సూచించారు. దేశంలోని ప్రముఖ వైద్య నిపుణులను 'శ్రీవారి సేవకులు'గా ఆహ్వానించి, వారి సేవలను ఈ ఆసుపత్రుల ద్వారా భక్తులకు, ప్రజలకు అందించేలా అవకాశం కల్పించాలని నిర్దేశించారు. తిరుమల ఆలయంలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రసాదాల తయారీ, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాల్లో తిరుమల ప్రమాణాలను అనుసరించాలని సూచించారు.

cm-chandra-babu-made-key-directions-for-ttd-to-appoint-vidya-sevaks-details-here

ఇక.. ప్రసాదాల తయారీకి సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలని, భక్తుల నిర్వ ణలో ఆధునిక సాంకేతికతను వాడుకోవాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యం కావాలని, టీటీడీ భక్తుల పోర్టల్‌ను ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేయాలని నిర్దేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. భక్తులకు సులభంగా సమాచారం అందించేలా న్ని సేవలను వాట్సప్ గవర్నెన్స్‌ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. రానున్న వైకుంఠ ఏకాదశికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎం టీటీడీ అధికారుల ఆదేశించారు. భక్తులు అన్ని భాషల్లోనూ దర్శనానికి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించేలా వీలైనంత ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ఇక.. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లో నిత్యాన్నదానం జరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించ తలపెట్టిన 5,000 దేవాలయాల డిజైన్లను మార్చి, వాటిలో ఆధ్యాత్మికత, ప్రశాంతత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు దర్శన సమయం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం నిమిషానికి 8 మంది దర్శనం చేసుకుంటున్నారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దర్శన టికెట్, కాటేజీ బుకింగ్‌ను ఒకేసారి అందించడం ద్వారా దళారుల బెడదను అరికట్టామన్నారు. లడ్డూ నాణ్యత పెంచడంతో పాటు అన్నప్రసాదంలో వడ కూడా అందిస్తున్నామని, వంటశాలను ఆటోమేషన్ చేసి రోజుకు 2.75 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా ప్రణాళిక చేస్తున్నామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+