తిరుమలలో చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో కీలక నిర్ణయం వెల్లడించారు. మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవ లో పాల్గొన్నారు. వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రసాదా లు పంపిణీ చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చెయ్యడం ద్వారా చాలా తృప్తి కలుగుతుంద ని చెప్పుకొచ్చారు. ముంతాజ్,ఎమర్,దేవాలోక్ హోటల్స్ నిర్మాణానికి భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

తిరుమలలో చంద్రబాబు ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. తన జీవితంలో వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకుని ముందుకు వస్తానని చెప్పారు.ప్రతి ఏటా అన్నదానంకు విరాళం అందిస్తున్నామని, ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం ట్రస్ట్‌కు ఇప్పటి వరకు రూ. 2,200 కోట్ల విరాళాలు అందాయని సీఎం చంద్రబాబు తెలిపారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చెయ్యడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలోని అన్ని అస్పత్రుల ద్వారా రాయలసీమలో వుండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రపంచంలో వున్న వైద్యులు తిరుపతిలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించి.. స్వామి వారిని దర్శించుకోవాలని అన్నారు. తనపై 27 క్లెమోర్ మైన్లతో దాడి చేశారని, శ్రీవారి ఆశీస్సులతో బయటపడ్డానని చెప్పారు.

CM Chandra Babu made kye announcement on Mumtaz hotels controversy in Tirupati

ఆ ప్రమాదం చూసిన తరువాత వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమలలో ఎవరు అపచారం చెయ్యొద్దని చంద్రబాబు సూచించారు. అలిపిరి వద్ద గత ప్రభుత్వంలో ముంతాజ్,ఎమర్,దేవాలోక్ హోటల్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, వాటి అనుమతులను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఏడుకొండలకు అనుకోని ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు,అధికారులు అందరూ కలిసి తిరుమల పవిత్రను కాపాడాలన్నారు. దేశ వ్యాప్తంగా వున్న శ్రీవారి ఆస్తులను కాపాడుతామని చంద్రబాబు వెల్లడించారు. తిరుమలలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పైన టీటీడీ బోర్డు, అధికారులను చంద్రబాబు ఆరా తీసారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+