నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదన్న చంద్రబాబు...ఒక్క కార్పోరేటర్ కూడా గెలిచేదిలేదన్న లోకేష్

|
Google Oneindia TeluguNews

నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ నమ్మించి మోసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. మంగళవారం నెల్లూరు ఎస్వీజీఎస్ కాలేజ్ గ్రౌండ్‌లో లో జరిగిన టీడీపీ ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

బిజెపి నమ్మక ద్రోహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని...అందువల్ల వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని...పరిస్థితి రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరుపుకోలేనంత దారుణంగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోడీ ఎన్నికల సందర్భంగా తిరుపతిలో ఇచ్చిన హామీలను సిఎం చంద్రబాబు సభలో ప్రదర్శించారు.

మట్టీ నీళ్లు తెచ్చి...మోసం చేసిన మోడీ

మట్టీ నీళ్లు తెచ్చి...మోసం చేసిన మోడీ

నవ్యాంధ్ర రాజధాని శంఖుస్థాపనకు ప్రధాని మోడీ మట్టి, నీళ్లు తెచ్చారని చాలా మంది విమర్శించారని...ఆ సభలో సైతం మోడీ అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. పోలవరంపై కూడా అలా మోసం చేస్తారని తెలిసే ముంపు మండలాలపై పట్టుబట్టామని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 16వేల కోట్లకు పైగా లోటు బడ్జెట్‌ ఉంటే కేవలం రూ. 3,900 కోట్లు ఇచ్చి అంతటితో ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. అమరావతి నిర్మాణానికి ఇచ్చింది కేవలం రూ.1600 కోట్లేనని చెప్పారు. అహ్మదాబాద్‌-ముంబై కారిడార్‌కు రూ. లక్షా 10 వేల కోట్లు కేటాయించారని, గుజరాత్‌లో పటేల్‌ విగ్రహానికి రూ. 3వేల కోట్లు ఇచ్చారన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోకు ఇప్పటిదాకా అతీ గతీ లేదన్నారు.

సమాధానం...చెప్పి తీరాలి

సమాధానం...చెప్పి తీరాలి

కడప స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం ముందుకు రాకపోతే తామే నిర్మిస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు. కేంద్రం పన్నులు వసూలు చేస్తాం...పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తుంటే.. బీజేపీ వాళ్లకు కడుపుమండుతోందని ఆయన అన్నారు. అంతేకాకుండా వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇచ్చి..మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై ఏపీ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని ప్రధాని మోడీని సిఎం చంద్రబాబు డిమాండ్ చేశారు.
విభజన సయమంలో టీడీపీ ఎంపీలు అందరికంటే ఎక్కువగా పోరాడారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

వాళ్ల దారి ఎటో...నాకు తెలుసు

వాళ్ల దారి ఎటో...నాకు తెలుసు

ఎపిలో ప్రతిపక్షం వైసీపీ దారి ఏంటో తనకు తెలుసునని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని వైసీపీకి సవాల్ విసిరితే పారిపోయిందన్నారు. మోడీని విమర్శిస్తే జైలుకు పంపుతారని జగన్‌కు భయమని, అందుకే పిరికితనంతో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని దుయ్యబట్టారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి రూ. 75వేల కోట్లు రావాలని కమిటీ వేసి మరీ తేల్చారని...అప్పుడు ఏవేవో సినిమా డైలాగులు చెప్పిన పవన్‌ అసలు విషయాలు మాత్రం మర్చిపోయారని చంద్రబాబు వ్యంగాస్త్రాలు సంధించారు.అంతేకాదు అవిశ్వాసానికి మద్దతు కూడగడతానని చెప్పిన పవన్‌ ఆ తరువాత ఎక్కడికి వెళ్లిపోయారని ప్రశ్నించారు.

ఒక్క కార్పోరేటర్...గెలవడు

ఒక్క కార్పోరేటర్...గెలవడు

మరోవైపు మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఎపిలో ఒక్క బీజేపీ ఒక్క కార్పొరేటర్‌ కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమని బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ మోసం చేసిందని...నాలుగేళ్లయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయేసరికి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని లోకేష్ వివరించారు. గుజరాత్ లో పటేల్ విగ్రహానికి 3వేల కోట్లు ఇచ్చిన కేంద్రం...ఏపీ రాజధాని నిర్మాణానికి మాత్రం రూ.1500 కోట్లే ఇచ్చిందని పునరుద్ఘాటించారు. ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కి తిత్లీ బాధితులను పలకరించే సమయం కూడా లేదా అని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు.

English summary
Chief Minister Chandrababu accused that BJP has betrayed the people of Andhra Pradesh. CM Chandrababu participated in the TDP Dharmaporata yatra held at Nellore SVGS College Ground on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X