బురదలో దిగాను - చంద్రబాబు..!!
వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లామని సీఎం చంద్రబాబు చెప్పారు. వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని ముఖ్యమంత్రి విడుదల చేసారు. గత ప్రభుత్వం గండ్లు పట్టించుకోకపోవటం..అక్రమ నిర్మాణాలతో బుడమేరు ఊహించని స్థాయిలో ముంచెత్తిందని పేర్కొన్నారు. వరద సమయంలో అందరం ఒక్కటిగా పని చేసామని చంద్రబాబు వివరించారు.
రాష్ట్రంలో అకాల వర్షాలు..వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వ సాయం విడుదల చేసింది. డీబీటీ విధానంలో బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ చేసారు. దాదాపు నాలుగు లక్షల మందికి రూ 602 కోట్ల మేర సాయంను ముఖ్యమంత్రి విడుదల చేసారు. విజయవాడలో భారీ వర్షంతో పాటుగా ఒక్కసారిగా బుడమేరు పొంగటంతో వరదలు వచ్చాయని చెప్పారు. గత ప్రభుత్వం గండ్ల విషయంలో నిర్లక్ష్యంతో పాటుగా అక్రమ నిర్మాణాలు వరదలకు కారణంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు.

తాను వరదల సమయంలో స్వయంగా బురదలోకి దిగానన్నారు. తనతో పాటుగా అధికార యంత్రాంగం మొత్తం 11 రోజులు నిర్విరామంగా పని చేయటంతో విపత్తు నుంచి తక్కువ సమయంలోనే బయట పడగలిగామని చంద్రబాబు చెప్పారు. విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారని అభినందించారు. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారని ముఖ్యమంత్రి వివరించారు. సీఎం సహాయనిధికి రూ. 400 కోట్లు రావడం ఒక చరిత్రగా పేర్కొన్నారు.
వరద బాధితులకు అన్నిరకాల సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు. తాను ఇప్పటి వరకు ఇలాంటి విపత్తు చూడలేదన్నారు. బుడమేరులో ఎన్నడూ చూడని వరదను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. బుడమేరు కబ్జాకు గురైందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా మోడరైజేషన్ పనులు నిలిపేసిందని చెప్పుకొచ్చారు. ప్రకృతితో ఆటలాడితే ఇలాంటి వరదలు వస్తాయని వ్యాఖ్యానించారు. వరద సమస్య పరిష్కారం కోసం కలక్టరేట్‌లో మకాం వేశానని గుర్తు చేసారు.












Click it and Unblock the Notifications