ప్రభుత్వం పై ప్రజల్లో సంతృప్తి లేదా - చంద్రబాబు కీలక రిపోర్ట్..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన పూర్తయింది. ప్రభుత్వ తాము ఎంతో సాధించామని చెబుతోంది. ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని చెప్పుకొస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం పైన ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నివేదికలు తెప్పించు కొన్నారు. తాజాగా పార్టీ సమావేశంలో జిల్లాల వారీగా ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న సంతృప్తి లెక్క ల గురించి వివరించారు. అదే సమయంలో ఇంఛార్జ్ మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
చంద్రబాబు ఆగ్రహం
పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. యువ మంత్రుల పనితీరు పై సీఎం అసహనం వ్యక్తం చేసారు. పాతవారిని పక్కన పెట్టి యువతరం అని కొత్తవారికి మంత్రి పద వుల్లో అవకాశం ఇస్తే వారిలో ఆ వేగం కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు .. మంత్రుల పనితీరుపై తన నివేదికల ఆధారంగా క్లాస్ తీసుకున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉంటే ఆరుగురు సీనియర్లు కాగా, 18 మందికి కొత్త వారికి అవకాశం ఇచ్చానని చెప్పారు. వారిలో వేగం ఉంటుందని భావిస్తే.. కనిపించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల్లో కి దూసుకు వెళ్లడానికి వచ్చిన అడ్డం ఏంటని ప్రశ్నించారు.

జిల్లాల వారీగా రిపోర్ట్
యువ మంత్రులు పనితీరు మెరుగు పర్చుకోకపోతే నష్టపోతారని హెచ్చరించారు. మంత్రులుగా శాఖపై పట్టుసాధించాలని.. అధికారులతో పని చేయించుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల స్వల్ప వ్యవధిలోనే అసాధ్యం అనుకొన్న పనులు అనేకం చేశామని చంద్రబాబు తెలిపారు. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు అలసత్వంతో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల సంతృప్తిలో ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు చెప్పారు. కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లోనూ, కడప, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి చివరి మూడుస్థానాల్లో ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు.
ఇంఛార్జ్ లదే బాధ్యత
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐటీ రంగంలో పనిచేసి వచ్చారు. ఆయన ర్యాంక్ కూడా సంతృప్తికరం గా లేదని చెప్పారు. జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు యాక్టివ్ కావాలని సూచించారు. పార్టీ - ప్రభుత్వ మధ్య సమన్వయ బాధ్యతలు వారిదేనని స్పష్టం చేసారు. అవసరమైతే మండలస్థాయి వరకు వెళ్లాలని చెప్పారు. కొత్త ఎమ్మెల్యేలు చాలా తప్పులు చేస్తున్నారని... నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేసారు. జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రి, జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీ, కలెక్టర్ ఒక బృందంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ భేటీకి కొందరు నేతలు దూరంగా ఉండటం పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ కోసం తాను ఎక్కువ సమయం కేటాయిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications