Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిద్దంగా ఉండండి - చంద్రబాబు కీలక ఆదేశాలు..!!

ఏపీ పై తుఫాను ప్రభావం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో కుండపోత కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏపీ ప్రభుత్వం తుఫాను పైన అప్రమత్తం అయింది. తుఫాను కదలిక..ప్రభావం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యల పైన ఆరా తీసారు. కోస్తా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజలను అలర్ట్ చేయాలని ఆదేశించారు.

అధికారులకు ఆదేశాలు
ఫెంగల్ తుఫాన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయి సమాచారం ఎప్పటి కప్పుడు తెప్పించుకోవాలని సూచించారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

CM Chandra Babu review over Fengal Cycolne issues key directions for officials

ముందస్తు చర్యలు
ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచనలు చేశారు. తుఫాన్‌పై ధాన్యం రైతులకు నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు చేరవేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. తుఫాను వేళ విద్యుత్ అధికారు లను విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అప్రమత్తం చేశారు. జిల్లాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని పరిస్థితు లను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

విద్యా సంస్థలకు సెలవు
విద్యుత్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచనలు చేశారు. సమస్యపై ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తిరు పతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్య సంస్థలకు నేటి మధ్యాహ్నం సెలవు ప్రకటించారు.
తుఫాను కారణంగా తమిళనాడులో వర్షాలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరంలో నీటి ముంపు తీవ్రమైంది. చెన్నై నగరం మొత్తం భారీ వర్షాల కారణంగా రహదారులు మరియు మౌలిక సదుపాయాలు పూర్తిగా నీటమునిగాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+