ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్..!!
కీలక పదవుల భర్తీ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో చర్చించారు. కొన్ని ముఖ్యమైన పదవుల భర్తీ పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం లో టీడీపీ భాగస్వామిగా ఉంది. దీంతో..ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఎవరికి అవకాశం ఇస్తారనేది కీలకంగా మారుతోంది. నలుగురు ముఖ్యులు పోటీ పడుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో చంద్రబాబు నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.
ఢిల్లీ పదవి కోసం
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని నలుగురు ముఖ్య నేతలు ఆశిస్తున్నారు. ఈ నలుగురికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవిని కోరినట్లు సమాచారం. ఏపీ సమస్యల పైన అవగాహన.. బీజేపీ ముఖ్యులతో సత్సంబంధాలు సుజనాకు కలిసి వస్తాయని భావిస్తున్నారు.

నలుగురు నేతల ప్రయత్నం
రెండు సార్లు గుంటూరు ఎంపిగా పని చేసి, జగన్ ప్రభుత్వం వేధింపులతో వ్యాపారపరంగా నష్టపోయి, ఎన్నికల్లో ఎంపి సీటును త్యాగం చేసిన తనకు ఢిల్లీ ప్రతినిధి పదవి ఇవ్వాలని గల్లా జయదేవ్ అంటున్నారు. ఎంపిగా చేసిన తనకు ఢిల్లీలో బిజెపి నేతలతో సత్సంబంధాలున్నాయని, ఒక విధంగా బిజెపి-టిడిపి పొత్తుకు ఢిల్లీలో కృషి చేశానని, జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులను ఎదుర్కొన్నానని, ఎంపి సీటును వదలుకొని ఎంఎల్‌ఎ అయ్యానని, అందుకే తనకు ఢిల్లీ ప్రతినిధిగా అవకాశం ఇవ్వాలని రఘురామ కోరినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఎవరి వైపు
గతంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పని చేసిన అనుభవం ఉన్న కంభంపాటి తనకు ఈ పదవి దక్కుతుందని ధీమాగా ఉన్నారు. బిజెపితో, కాంగ్రెస్, ఇతర అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలుండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఈ పదవిపై ఆచి తూచి నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాల్సిన వేళ ఏపీ అధికార ప్రతినిధి పాత్ర కీలకంగా మారనుంది. దీంతో, చంద్రబాబు చివరగా ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications