కూటమి నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు- అనూహ్య ఎంపిక..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ముందుగా స్థానిక ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించాలని భావిస్తున్నాయి. ఇందు కోసం మూడు పార్టీలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లేందుకు రంగం సిద్దం చేస్తున్నాయి. కాగా, శాసన మండలిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. ఈ స్థానాల్లో కూటమి నుంచి కొత్తగా ఇద్దరికి అవకాశం దక్కనుంది. వీరి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కొత్త ఎమ్మెల్సీల ఎంపిక పైన కూటమి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీకి ఈ రెండు స్థానాలు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి 164 మంది సభ్యుల బలం ఉంది. మండలిలో మాత్రం వైసీపీకి ఆధిక్యత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేస్తున్నారు. చేయనున్నారు. వారి స్థానంలో కూటమి నుంచి ఇద్దరి పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నమండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీకాలం పూర్తికానుంది. ఇప్పటికే జాకియా ఖానం బీజేపీకి దగ్గరయ్యారు. ఈ ఇద్దరి పదవీ కాలం ముగియటంతో ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో రెండు సీట్లు కూటమి ఖాతాలోనే జమ కానున్నాయి. అందులో భాగంగా ఈ రెండు స్థానాల భర్తీ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.

తుది కసరత్తు... ఛాన్స్ దక్కేదెవరికి
2024 ఎన్నిక సమయంలో పలువురు సీనియర్లకు సీట్ల త్యాగం చేసిన కారణంగా ఎమ్మెల్సీ సీట్ల పైన హామీ ఇచ్చారు. వారిలో చాలా మంది ఇప్పుడు ఈ సీట్ల వైపు ఆశగా చూస్తున్నారు. దేవినేని ఉమా, వంగవీటి రాధా, పిఠాపురం వర్మ సహా పలువురు నేతలు ఈ రేసులో ఉన్నారు. అయితే, రాజ్యసభ సీటు కోసం పలు మార్లు ఆశించి.. నిరాశ చెందిన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఈ సారి ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని సమాచారం. సామాజిక సమీకరణాల్లో భాగంగా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పూర్తి కావటంతో.. ఇప్పుడు మండలికి వర్ల రామయ్యను పంపాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, రెండో స్థానం రాయలసీమ నుంచి ఎంపిక చేయనున్నారు.
అందులో భాగంగా బీటెక్ రవి, సుగవాసి ప్రసాద్ బాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సుగవాసికి గతంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. కాపు-బలిజ సామాజిక వర్గానికి సీమ ప్రాంతం నుంచి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాయచోటి జిల్లా కేంద్ర హోదా కోల్పోవడం, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో ఇప్పుడు ప్రసాద బాబుకు ఇవ్వటం అవసరమని గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో.. చంద్రబాబు చివరగా ఎవరికి అవకాశం ఇస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications