అన్నాక్యాంటీన్లు సిద్దం - రోజు వారి మెనూ, ధరలు ఇలా..!!
ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో అన్నాక్యాంటీన్ ను ప్రారంభించేందుకు నిర్ణయించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. క్యాంటీన్లలో రోజు వారి అందించే మెనూ..ధరలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానుంది.
క్యాంటీన్లు సిద్దం
ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తోంది. ఇందుకు సర్వం సిద్దమైంది. హరేక్రిష్ణ మూవ్ మెంట్ సంస్థకు అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ సంస్థ కేవలం మూడు గంటల్లోనే లక్ష మందికి ఆహారం సిద్దం చేసే క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. 15వ తేదీన 99 క్యాంటీన్లు, సెప్టెంబర్ 5న మరో 99 క్యాంటీన్లను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇప్పటికే వ్యాపారవేత్తలు, ప్రముఖులు అన్నా క్యాంటీన్ల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నారు.

మెనూ..ధరలు
ఇక, అన్నాక్యాంటీన్లలో ప్రతీ రోజు అందించాల్సిన మెనూ, ధరలను ఖరారు చేసారు. ఉదయం టిఫిన్, మధ్నాహ్నం భోజనం రాత్రికి డిన్నర్ ఏదైనా రూ 5 కే అందించాలని నిర్ణయించారు. ఇక, మెనూ ప్రకారం ప్రతీ సోమవారం ఉదయం టిఫిన్ గా ఇడ్లీ (చట్నీ, సాంబార్)లేదా పూరీ కూర్మాతో అందిస్తారు. లంచ్ గా వైట్ రైస్ కూర, పప్పు లేదా సాంబార్, పచ్చడి, పెరుగుతో అందుబాటులోకి తెస్తున్నారు. వారంలో ప్రతీ రోజు లంచ్,డిన్నర్ లో భాగంగా ఇదే రకంగా మెనూ ఉండనుంది. పదార్ఢాలు మాత్రం మారనున్నాయి.
భారీగా విరాళాలు
మంగళవారం నుంచి శనివారం వరకు ఉదయం అందించే టిఫిన్ లో ఇడ్లీ కామన్ గా ఉంటుంది. ఇక, రెండో టిఫిన్ గా పూరీ, పొంగల్, ఉప్మా అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు టిఫిన్ ఉంటుంది.లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు అందిస్తారు. రాత్రి డిన్నర్ రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. ఆదివారం సెలవుగా ప్రకటించారు. వారంలో ఒక రోజు స్పెషల్ రైస్ ఇవ్వనున్నారు. ప్రభుత్వం విరాళాలు ఇచ్చే వారు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications