ప్రధాని సమక్షంలో కొత్త రికార్డు దిశగా చంద్రబాబు- కీలక నిర్ణయం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు కొత్త రికార్డు దిశగా కార్యాచరణ ఖరారు చేసారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రధాని మోదీని ఇప్పటికే చంద్రబాబు విశాఖ కు ఆహ్వానించారు. నేటి నుంచి నెల రోజుల పాటు యోగా దినోత్సవం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగా మన వారసత్వమని.. యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధాని మోదీ కారణమన్నారు. యోగా మెరుగైన జీవనానికి దోహద పడుతుందని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు ఇచ్చారు.
యోగా డే నాడు
అందరి జీవితాల్లో యోగా అనే ఒక భాగం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని చెప్పుకొచ్చారు. ఫొటోలు, ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఒక దీక్ష , పట్టుదలతో చేస్తున్నారన్నారు. నేటి (బుధవారం) నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర -2025పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిం చనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 5 లక్షల మందితో వచ్చే నెల 21 తేదీన యోగా డే నిర్వహిస్తామని.. ఉదయం 7 నుంచి 8 గంటలకు విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో యోగ డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్ ఇస్తామన్నారు.

యోగా ద్వారా
యోగా వల్ల మానసిక ప్రశాంత ఏర్పడిందని అన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు యోగాను ప్రమో ట్ చేస్తున్నారని తెలిపారు. 26 జిల్లాలో నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ప్రచార కార్యక్రమా లు నిర్వహిస్తామన్నారు. మీడియా కూడా యోగాను ప్రమోట్ చేసేందుకు కృషి చేయాలని కోరారు. 2,500 మందిని మాస్టర్ ట్రైనర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
కాగా, ప్రభుత్వం రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన, శిక్షణ ఇవ్వనున్నారు. నిపుణులు రూపొందించిన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం శిక్షణ, అభ్యాసం చేస్తారు. యోగాలో శిక్షణ పొందిన కనీసం 20 లక్షల మందికి సర్టిఫికెట్ల జారీకి ఏర్పాట్లు జరుగుతు న్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వ హించనున్నారు. జూన్ 21న విశాఖ ఆర్‌కే బీచ్‌లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications