వారానికి ఒక్క పూట, ఆమె సహకారం: భువనేశ్వరిపై చంద్రబాబు ఆసక్తికరం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తన భార్య సపోర్టు లేకుండా రాజకీయాల్లో తాను ఇంత సమర్థవంతంగా పనిచేయలేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా తాను కొనసాగడానికి తన భార్య భువనేశ్వరి ఇస్తున్న మద్దతే కారణమని చంద్రబాబునాయుడు చెప్పారు.

రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగడానికి కుటుంబసభ్యుల మద్దతు తప్పనిసరిగా ఉండాల్సిందేనని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు.

కుటుంబసభ్యుల మద్దతు లేకపోతే పురుషులు తమ రంగాల్లో పూర్తిస్థాయిలో విజయాన్ని సాధించలేరని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.తనకు అలాంటి ఇబ్బందులు లేవని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

 భార్య సహకారం లేకపోతే

భార్య సహకారం లేకపోతే

కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్య సహకారం లేకపోతే పురుషులు తమ రంగాల్లో పూర్తి స్థాయిల్లో విజయం సాధించలేరని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల్లో విజయం సాధించడం వెనుక తన భార్య మద్దతు ఉందని ఆయన గుర్తు చేశారు. అందరికీ కూడ ఇదే రకమై మద్దతు లభిస్తే అందరూ కూడ విజయాన్ని సాధిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 కుటుంబసభ్యులకు వారానికి ఒక పూట

కుటుంబసభ్యులకు వారానికి ఒక పూట

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు హైద్రాబాద్‌ నుండి పార్టీ కార్యక్రమాలను నిర్వహించేవారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే చంద్రబాబునాయుడు వారానికి ఒక్క పూట మాత్రం కుటుంబసభ్యులకు కేటాయించేవాడు. ప్రతి ఆదివారం మద్యాహ్నం ఒంటిగంటవరకు మాత్రమే పార్టీ కార్యక్రమాలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించేవారు. మధ్యాహ్నం ఒంటి గంట దాటితే ఎవరికీ అపాయింట్ ‌మెంట్ ఉండకపోయేది.అయితే ప్రస్తుతం ఏపీ రాజధాని కేంద్రంగా బాబు పాలన సాగిస్తున్నారు. భువనేశ్వరీ ఆయన కోడలు బ్రహ్మణి హైద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీలున్నప్పుడు చంద్రబాబునాయుడు హైద్రాబాద్ వెళ్ళి వస్తున్నారు.

 అత్యవసర పరిస్థితుల్లో

అత్యవసర పరిస్థితుల్లో

వారంలో ఒక్క పూట కుటుంబసభ్యులకు బాబు కేటాయించేవారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఇందుకు మినహయింపు ఇచ్చేవారు. ఈ పరిస్థితుల్లో యధావిధిగా సమావేశాలను నిర్వహించేవారు.బాబు పాదయాత్ర నిర్వహించిన సమయంలో బాబుతో పాటు భువనేశ్వరి మెదక్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు.

 విజయం సాధించాలంటే

విజయం సాధించాలంటే

ప్రతి రంగంలో పురుషులు పూర్తిస్థాయిలో విజయం సాధించాలంటే వారి భార్యల సపోర్ట్ తప్పనిసరని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.భార్య మద్దతు లేకపోతే పరిపూర్ణ విజయాన్ని సాధించలేరని చంద్రబాబునాయుడు చెప్పారు.తనకు తన భార్య పూర్తి స్వేచ్చ ఇచ్చిందని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has revealed the recent comment made by his wife Nara Bhuvaneswari. Addressing at an event, the Chief Minister said that since 30-35 years, his wife has been extending support to him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి