శుభవార్త- ఏపీలో వారి ఖాతాలో నిధులు జమ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. సంక్షేమ పథకాల అమలుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. సూపర్ సిక్స్ పథకాలను లబ్దిదారులకు చేరవేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించనుంది.

రాష్ట్రంలో అర్హులైన ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తోన్నట్లు గతంలోనే వెల్లడించింది టీడీపీ కూటమి ప్రభుత్వం. దీనికి అనుగుణంగా తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి లబ్దిదారులను ఖరారు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. సొంతంగా ఆటోరిక్షా/మోటార్ క్యాబ్‌/మ్యాక్సీ క్యాబ్ ఉండి డ్రైవర్‌గా స్వయం ఉపాధి పొందుతున్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దీనికింద వారందరికీ ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. వారందరినీ ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.

CM Chandrababu Delivers Financial Relief Rs 15 000 for 2 90 Lakh Auto Drivers Today

ఈ పథకాన్ని చంద్రబాబు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. విజయవాడ అజిత్ సింగ్‌ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ పాల్గొంటారు. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కూడా.

ఈ పథకంలో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు రూ.34.43 కోట్ల లబ్థి కలగనుంది.

నెల్లూరు- 17,405 మందికి రూ.26.10 కోట్లు

ఎన్టీఆర్‌- 16,405 మందికి రూ.24.60 కోట్లు

విజయనగరం- 15,479 మందికి రూ.23.21 కోట్లు

శ్రీకాకుళం- 13,887 మందికి రూ.20.83 కోట్లు

అనకాపల్లి- 13,753 మందికి రూ.20.62 కోట్లు

కర్నూలు- 13,495 మందికి రూ.20.24 కోట్లు

గుంటూరు- 13,204 మందికి 19.80 కోట్లు

తిరుపతి- 13,125 మందికి రూ.19.68 కోట్లు

కాకినాడ- 12,966 మందికి రూ.19.44 కోట్లు

తూర్పు గోదావరి- 11,915 మందికి రూ.17.87 కోట్లు

కడప- 11,456 మందికి రూ.17.18 కోట్లు

ప్రకాశం- 11,356 మందికి రూ.17.03 కోట్లు

కృష్ణా- 11,316 మందికి రూ. 16.97 కోట్లు,

ఏలూరు- 10,655 మందికి రూ.15.98 కోట్లు

నంద్యాల- 9,569 మందికి రూ.14.35 కోట్లు,

అనంతపురం- 9,275 మందికి రూ.13.91 కోట్లు,

పల్నాడు- 8,884 మందికి రూ.13.32 కోట్లు

పశ్చిమ గోదావరి- 8,489 మందికి రూ.12.73 కోట్లు

కోనసీమ- 7,709 మందికి రూ.11.56 కోట్లు

బాపట్ల- 6,859 మందికి రూ.10.28 కోట్లు

చిత్తూరు- 6,777 మందికి రూ.10.16 కోట్లు

పార్వతీపురం మన్యం- 4,963 మందికి రూ.7.44 కోట్లు,

అల్లూరి సీతారామరాజు- 4,217 మందికి రూ.6.32 కోట్ల మేర నిధులు జమ కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+