AP Assembly:జగన్ కు రఘురామ గుడ్ న్యూస్-ఆ హోదా లేకున్నా సీటు..!
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన తర్వాత విపక్ష హోదా పొందే అవకాశం కోల్పోయిన వైసీపీ కొంతకాలంగా దీని కోసం పోరాటాలు చేస్తోంది. తమ నాయకుడు వైఎస్ జగన్ కు విపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని, లేకుంటే బాయ్ కాట్ చేసి వెళ్లిపోతామని వైసీపీ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పేస్తున్నారు. తాజాగా బడ్డెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం రోజు హాజరైనా జగన్ కు విపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా బాయ్ కాట్ చేసేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో సీఎం, డిప్యూటీ సీఎం సహా ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా అంతా ఎక్కడెక్కడ కూర్చోవాలో సీట్లను ఖరారు చేశారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం లకు సాధారణంగా ట్రెజరీ బెంచ్ లో ఇచ్చే ముందు వరుస సీట్లను కేటాయించారు. అలాగే మంత్రులకు కూడా ముందు వరుసతో మొదలుపెట్టి సీట్లను కేటాయించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు సీట్లు దక్కాయి.

అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో సీనియార్టీ ప్రకారం కింద నుంచి పైకి వెళ్లారు. సీఎం, మంత్రుల తర్వాత వెనుక వరుసల్లో ఎమ్మెల్యేల సీనియార్టీ అధారంగా సీట్లు దక్కాయి. అయితే ఇదే క్రమంలో విపక్ష నేత హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ కు సైతం ముందు వరుసలో సీటును రఘురామ కేటాయించారు. విపక్ష ఎమ్మెల్యేలుకు కూర్చొనే వైపు ముందు వరుసలో జగన్ కు సీటు ఇచ్చారు. దీంతో విపక్ష నేత హోదా దక్కకపోయినా ఆయన కూర్చొనే సీటు మాత్రం జగన్ కు దక్కినట్లయింది. ఇకపై అసెంబ్లీ సమావేశాల్లో ఈ సీట్ల ప్రకారమే సభ్యులు కూర్చోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications