జెడ్పీటీసీ ఎన్నికల వేళ చంద్రబాబు కీలక నిర్ణయం, వారికీ పదవులు..!!

ఏపీలో స్థానిక సంస్థల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. ఇక, ఇప్పుడు జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నిక ల కు సర్వం సిద్దమైంది. రేపు (గురువారం) ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో సీఎం చంద్రబాబు కూటమి ముఖ్య నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. అన్ని స్థానాల్లోనూ విజయం దక్కే విధంగా కూటమి నేతలు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేసారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూటమి నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజల కు మనం అండగా నిలిస్తే.. వారు మనతోనే ఉంటారని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపితమైందని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతం స్ట్రెయిక్ రేట్ సాధించామని అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో దక్కిన విజయం.. మన బాధ్యతను పెంచిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఫలితాలు కూటమి సంక్షేమం - అభివృద్ధి - సుపరిపాలనకు గుర్తింపు అని అభివర్ణించారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేని వారికి నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో అనుకున్న విధంగానే ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.

 వంగవీటి రాధా ఘన విజయం.. మెజార్టీ: ABV కి దక్కిన ఓట్లు, రెండో స్థానం..!!
వంగవీటి రాధా ఘన విజయం.. మెజార్టీ: ABV కి దక్కిన ఓట్లు, రెండో స్థానం..!!
cm-chandrababu-directs-tdp-leaders-to-win-all-zilla-parishad-and-mpp-posts-details-here

చంద్రబాబు కీలక దిశా నిర్దేశం

గుడ్ గవర్నెన్స్.. గుడ్ పాలిటిక్స్ ఇదే కూటమి ప్రభుత్వ విధానం అని చంద్రబాబు స్పష్టం చేసారు. ప్రజలకు మంచి చేస్తే.. అన్ని స్థాయిల్లోనూ వారు గుర్తిస్తారని.. మన వెన్నంటే ఉంటారని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఈ విషయాన్ని నిరూపిం చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పడుతోన్న కష్టాన్ని ప్రజలు గుర్తించారని వివరించారు. మంచికి.. మంచి ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ ఫలితాల ద్వారా ప్రజలు చాటి చెప్పారని అన్నారు. మరింత చక్కటి పాలనను అందించేందుకు ప్రొత్సహాన్ని ఇస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో కూడా 94 శాతం స్ట్రెయిక్ రేట్ సాధించగలిగామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఓడిపోయిన కొన్ని చోట్ల కూడా కూటమి పార్టీలకు చెందిన రెబెల్సే గెలిచారని గుర్తు చేశారు. కూటమిలో ఐక్యత ఎంత మాత్రం చెడిపోకూడదని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+